NTV Telugu Site icon

Telangana Cabinet: నేడు తెలంగాణ కేబినెట్‌ భేటీ.. రుణమాఫీతో పాటు ప‌లు అంశాల‌పై చర్చ

Telangana Cabinet Meeting

Telangana Cabinet Meeting

Telangana Cabinet: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. సచివాలయంలో రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగే కేబినెట్‌ సమావేశంలో రైతు రుణమాఫీతోపాటు కీలక అంశాలపై చర్చించనున్నారు. పరిపాలనకి సంబంధించిన అనేక అంశాల పై చర్చించనున్నారు. ఇరు రాష్ట్రల మధ్య ఆస్తులు, అప్పుల పంపకాల పై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. రైతు రుణమాఫీ, రైతు భరోసాకి నిధుల సమీకరణ పై చర్చ..కట్ ఆఫ్ పెట్టాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. రుణమాఫీ పై మహారాష్ట్ర, రాజస్థాన్ లో పర్యటించి తెలంగాణ అధికారులు బఅధ్యయనం చేశారు. విద్యుత్ ఒప్పందాలు, కాళేశ్వరం పై చర్చించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వనికి ఆదాయం వచ్చే మార్గాల పై దృష్టి సారించారు. భూముల రిజిస్ట్రేషన్ ధరల పెంపు, లిక్కర్ ధరలు పెంచే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అసెంబ్లీ సమావేశాలపై చర్చించి తేదీలను ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి.

Read also: Health Tips : ఎప్పుడూ యవ్వనంగా ఉండాలంటే రోజూ ఈ డ్రింక్ ను తాగాల్సిందే..

ప్రధానంగా అర్హత ప్రాతిపదికన కిసాన్ సమ్మాన్ నిధిని తీసుకోవడంతోపాటు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. రైతు భరోసా, రైతు బీమా,పంటల బీమా కోసం కిసాన్ సమ్మాన్ ఫండ్ అర్హతను కూడా ఖరారు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటన్నింటినీ మంత్రివర్గంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు గడిచినా ఇప్పటి వరకు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ విభజన చట్టం ప్రకారం తెలంగాణకు దక్కింది. దీంతో హైదరాబాద్ లోని ఏపీ ఆస్తులతో పాటు రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై మంత్రులు చర్చించనున్నారు. లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం ప్రస్తుతం పూర్తిస్థాయి బడ్జెట్‌పై కసరత్తు చేస్తోంది. ఈ అంశాలపై కూడా సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.

Read also: India-China: పాసింజర్ విమానాలను పునఃప్రారంభించాల కోరిన చైనా..భారత్ నిరాకరణ

కాగా 15లోగా రూ. 2లక్షల రైతు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ రైతు బంధు పథకం కింద తెలంగాణలో సుమారు 66లక్షల మంది లబ్దిదారులు ఉన్నారు. కాగా.. వీరిలో రూ.2లక్షల లోపు రుణాలు పొందినవారు దాదాపు ఇంతకుముందే ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నాట్లు సమాచారం. దీంతో రైతు బంధు లబ్దిదారుల్లో దాదాపు 6లక్షల మందికి పట్టాదారు పాస్బుక్‌ లు లేవు కావున వాని ప్రమాణికంగా తీసుకుంటే లబ్దిదారుల సంఖ్య 60లక్షలకు తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు.

Read also: Friday Stotram: శుక్రవారం ఈ స్తోత్ర పారాయణం చేస్తే రుణ బాధలు తొలగిపోతాయి

ఇది ఇలా ఉంటే.. కుటుంబంలో ఇద్దరు, ముగ్గురికి రైతు బంధు వస్తోంది. వారందరికి రేషన్‌ కార్డులు లేవు. కుటుంబ పెద్దకు మాత్రమే ఉంటుంది. రేషన్‌ కార్డు నిబంధన పెడితే కుటుంబంలో రైతుకు మాత్రమే రుణమాఫీ వర్తిస్తుందని దీంతో మరో 18 లక్షల మంది తగ్గే అవకాశం ఉందని క్యాబినెట్‌ వర్గాలు సమాలోచనలో ఉన్నట్లు టాక్‌. ఇక మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపన్ను చెల్లంపుదారులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను మినహాయిస్తే.. మరో రెండు లక్షల మంది తగ్గుతారని అధికారులు అంచనా వేస్తు్న్నారు. దీంతో ఇవన్నీ పరిగనలోకి తీసుకుంటే రుణమీఫీ పథకానికి అర్హులయ్యేవారు సుమారు 40 లక్షల మంది వరకే ఉంటారని అంటున్నారు. మరి దీనిపై ఇవాళ జరిగే కేబినెట్‌ మీటింగ్‌లో ఏఏవి చర్చకు వస్తాయనే దానినిపై ఉత్కంఠ నెలకొంది.
Vivo Y58 5G Price: ‘వివో’ కొత్త స్మార్ట్‌ఫోన్‌.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ! ధర కూడా తక్కువే