Site icon NTV Telugu

CABINET DECISSIONS Full Details: తెలంగాణలో మెగా నిర్ణయాలు.. ఎవరికెంత లాభం.?

Telangana Cabinet

Telangana Cabinet

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలతో మరోసారి సంచలనం సృష్టించింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం నుంచి హైదరాబాద్ మెట్రో స్వాధీనం వరకు పలు ప్రధాన అంశాలపై కీలక ఆమోదాలు లభించాయి. ప్రమాద బీమా, క్యాష్‌లెస్ హెల్త్ స్కీమ్, హెచ్ఎండిఎ విస్తరణ, రోడ్లు–నీటి ప్రాజెక్టులు వంటి నిర్ణయాలతో రాష్ట్ర పరిపాలనలో కొత్త దిశ కనిపిస్తోంది.

1. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం.. భద్రతకు రాష్ట్ర మంత్రి వర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలోనే ఆదర్శవంతమైన కొత్త పథకాలు అమలు చేసేందుకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు జరిగిన మంత్రివర్గం ఆమోదం తెలిపింది.  ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి భద్రత, భరోసా కల్పించేందుకు రెండు కొత్త పథకాలను ప్రారంభిస్తుంది.

మొదటిది.. ఉద్యోగుల ప్రమాద బీమా పధకం

 

2. ఉద్యోగులకు రెండో శుభవార్త.. క్యాష్ లెస్ ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్

3. రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వ హాస్పిటళ్లలో మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

4. వైద్య ఆరోగ్య శాఖలో కీలక సంస్కరణలు చేపట్టాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. రాష్ట్రంలో వివిధ విభాగాల పరిధిలో ఉన్న అన్ని ఆసుపత్రుల నిర్వహణ సమర్థవంతంగా జరిగేలా చర్యలు చేపట్టాలని చర్చించింది.

5. హెచ్ఎండిఎ విస్తరణలో భాగంగా మరో నాలుగు గ్రామాలను హెచ్ఎండిఎ పరిధిలో చేర్చేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వికారాబాద్ జిల్లాలోని నవాబ్ పేట్ మండలంలోని చిట్టిగూడ, యావపూర్, మోమిన్ పేట మండలం టేకులపల్లి, ఎంకతాల గ్రామాలను హెచ్ఎండిఎ పరిధిలో చేర్చారు.

6. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కాంప్రెహేన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ (CRMP phase 2) చేపట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

7. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోమంజీరా వాటర్ సప్లై స్కీమ్ ఫేస్ 1, ఫేస్ 2 ఆధునీకరణ ప్రాజెక్ట్ కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. హైదరాబాద్ జల మండలి ప్రతిపాదనల మేరకు రూ. 722 కోట్ల తో ఈ ప్రాజెక్ట్ పనులకు నిర్ణయం తీసుకుంది.

8. హైదరాబాద్ మెట్రోను ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతమున్న 69 కిలోమీటర్ల మెట్రో వ్యవస్థను ఎల్ అండ్ టీ కంపెనీ నుంచి పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. వెంటనే అందుకు అవసరమైన చర్యలు ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది.

9. రంగారెడ్డి జిల్లా కోహెడ‌లో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్‌, ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్‌ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అందుకు అవసరమైన 223.09 ఎక‌రాల భూమిని TGIIC బ‌ద‌లాయించాలని నిర్ణయం తీసుకుంది.

10. క్యూర్ ఏరియాలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల దగ్గర నిర్మించిన షాప్స్ వేలం వేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులను రాబట్టుకోవడానికి ప్రయత్నించాలని చర్చించింది.

11. క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా 300 మెగావాట్ల విద్యుత్తు వినియోగించే డేటా సెంటర్లకు రెన్యుబుల్ ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ ఇచ్చేందుకు కేబినేట్ ఆమోదించింది.

 

Exit mobile version