NTV Telugu Site icon

Telangana Budget Updates: ముగిసిన తెలంగాణ కేబినెట్‌ భేటీ .. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌కు ఆమోదం

Bhatti Vikramarka Budjet 2024

Bhatti Vikramarka Budjet 2024

Telangana Budget Updates: తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. 2024-25కి సంబంధించి ఓటింగ్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. అసెంబ్లీ కమిటీ హాల్ నంబర్ 1న జరిగిన మంత్రివర్గ సమావేశం జరిగిన విషయం తెలిసిందే.. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు మండలిలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ తొలి బడ్జెట్ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాష్ట్ర బడ్జెట్ రూ.3 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా.

Read also: David Warner: రిటైర్మెంట్ ఏజ్‌లో విధ్వంసం.. మొదటి ఆస్ట్రేలియా బ్యాటర్‌గా రికార్డు!

సంక్షేమం, అభివృద్ధే ప్రధాన ధ్యేయంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతుందన్నారు. బడ్జెట్‌లో 6 హామీల అమలుకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తుంది. గొప్పలకు పోకుండా వాస్తవిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నామని రేవంత్‌రెడ్డి సర్కార్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్‌ అన్ని వర్గాలకు మేలు చేస్తుందని అధికార పార్టీ చెబుతోంది. ఈరోజు అసెంబ్లీకి ప్రతి పక్ష నేత కేసీఆర్ హాజరుకానున్నారు.
TSRTC: ఆర్టీసీ రికార్డ్ బ్రేక్.. మహాలక్ష్మీ పథకం ద్వారా 15 కోట్ల మంది ప్రయాణం