Site icon NTV Telugu

Telangana BJP : టీబీజేపీ అధ్యక్షుడిగా రామచందర్‌రావు.. అధికారికంగా ప్రకటన

Ramchandar Rao Bjp

Ramchandar Rao Bjp

Telangana BJP : తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడిగా ప్రముఖ న్యాయవాది, ఏబీవీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ ఎన్. రామచందర్ రావు ఎంపికయ్యారు. బీజేపీ సంస్థాగత ఎన్నికల అధికారి, కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే ఆయన పేరును అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా మన్నెగూడలో జరిగిన సభకు భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు.

Daggubati Purandeswari: స్వలాభాపేక్ష ఏ రోజూ చూసుకోలేదు.. నాకు మరో ఆలోచన లేదు!

వేదిక వద్ద ర్యాలీగా వచ్చిన నూతన అధ్యక్షుడికి ఘన స్వాగతం లభించింది. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌తో పాటు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రామచందర్ రావుకు శుభాకాంక్షలు తెలుపుతూ, పార్టీ విజయాలను మరింత పటిష్టం చేస్తారన్న ఆశాభావం వ్యక్తమయ్యింది.

ఇక ఆంధ్రప్రదేశ్ బీజేపీలోనూ మార్పులు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర కొత్త అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ మాధవ్‌ను బీజేపీ అధిష్ఠానం ఎంపిక చేసింది. మాధవ్ గతంలో శాసన మండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా సేవలందించగా, ప్రస్తుతం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేవైఎంలలోనూ ఆయనకు విశేష అనుభవం ఉంది. ఈ నిర్ణయాలతో రెండు రాష్ట్రాల్లో పార్టీకి కొత్త జోష్ వచ్చే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

Dil Raju : తమ్ముడు” నో డౌట్.. నితిన్ కు కమ్ బ్యాక్ మూవీ అవుతుంది

Exit mobile version