Telangana BJP: తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిపై నెలలుగా కొనసాగిన ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. పార్టీ రాష్ట్ర శాఖకు నూతన అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ గారపాటి రామచంద్రరావు బాధ్యతలు చేపట్టనున్నారు. పార్టీ అధిష్ఠానం ఆయన పేరును అధికారికంగా ఖరారు చేసింది. అధ్యక్ష ఎన్నిక నామినేషన్ గడువు ముగిసే సమయానికి ఒక్కటే నామినేషన్ రావడంతో, రామచంద్రరావు ఏకగ్రీవంగా పార్టీ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు ఆయన నిన్న నామినేషన్ దాఖలు చేశారు.
Thammudu : ‘తమ్ముడు’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్..?
ఈ పదవికి బండి సంజయ్, ధర్మపురి అరవింద్, లక్ష్మణ్, డీకే అరుణ, రాజాసింగ్ వంటి నాయకుల పేర్లు చర్చలో ఉన్నా, అధిష్ఠానం రామచంద్రరావు వైపు మొగ్గు చూపింది. అధ్యక్ష పదవిని ఆశించిన ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర అసంతృప్తితో పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రామచంద్రరావు పేరు ఖరారులో ఆర్ఎస్ఎస్‌తో పాటు పార్టీ సీనియర్ నేతల మద్దతు కీలకంగా నిలిచిందని తెలుస్తోంది. ఈ రోజు ఆయన ఎన్నికపై ఆధికారిక ప్రకటన విడుదల కానుంది. అయితే ఇప్పటికే పలువురు నేతలు, కార్యకర్తలు, అభిమానులు రామచంద్రరావుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
