NTV Telugu Site icon

Telangana BJP: నేడు ప్రధానితో తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు సమావేశం..

Pm Modi

Pm Modi

Telangana BJP: నేడు ప్రధాని నరేంద్ర మోడీతో తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు పార్లమెంట్ లోని పీఎం కార్యాలయంలో భేటీ కానున్నారు. నియోజక వర్గాల్లో అభివృద్ధి అంశాలతో పాటు, తెలంగాణలో పార్టీ పరిస్థితులపై చర్చించనున్నారు. ప్రధానితో సమావేశం అనంతరం, కిషన్ రెడ్డి నివాసంలో బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలతో బీజేపీ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. పార్టీ సంస్థాగత ఎన్నికల వేళ, బీజేపీ నేతల సమావేశానికి కీలక ప్రాధాన్యత సంచరించుకుంది.

Read also: Sreeleela: శ్రీలీలకు బంపరాఫర్.. సూపర్ హిట్ హీరోతో ఛాన్స్?

తెలంగాణలో ప్రస్తుతం కుల గణన సర్వే జరుగుతోంది. మరికొద్ది రోజుల్లో ఈ సర్వే పూర్తి కానుంది. ఆ తర్వాత రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ ఎన్నికల్లో తమ పార్టీ సత్తా చాటేందుకు ఈ ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ పార్టీ.. ఈ ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు సిద్ధమైంది.

Read also: Social Media: 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం బిల్లుకు ఆస్ట్రేలియా ఆమోదం

ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ రంగంలోకి దిగి స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కొత్త వారిని నియమించే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రధానితో భేటీలో కేటాయింపుతోపాటు పలు కీలక అంశాలపై ఎంపీలు చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. మంగళవారం భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఉభయ సభలకు సెలవు ప్రకటించారు. మంగళవారం నుంచి ఆయా సభలు యథావిధిగా కొనసాగనున్నాయి.
Weather Update: తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చలి.. 15 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు.