Site icon NTV Telugu

అవినీతిపరులు ఓడిపోతారు.. ఈటల గెలుస్తారు-తరుణ్ చుగ్

Tarun Chugh

Tarun Chugh

తెలంగాణలో రానున్న ఎన్నికల్లో సీఎం కేసీఆర్ వంశస్థులు… అవినీతిపరులు ఓడిపోతారని వ్యాఖ్యానించారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్.. హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో కమలం, కేసీఆర్ అహంకారంని అణిచి వేస్తుందన్న ఆయన.. తెలంగాణ ప్రజలు, కేసీఆర్ ఆహంకారానికి మధ్య జరుగుతున్న పోరు ఇదిగా అభివర్ణించారు.. కేసీఆర్ రైతులను.. యువకులను మోసం చేశారని ఆరోపించిన తరుణ్‌ చుగ్.. కేసీఆర్ అహంకారం దిగుతుంది.. ఈటల రాజేందర్‌ గెలుస్తాడని ధీమా వ్యక్తం చేశారు.. తెలంగాణలో వారసత్వ రాజకీయాలను అంతం చేస్తామని ప్రకటించిన ఆయన.. హుజురాబాద్‌లో కమల వికాసం ఖాయం అని జోస్యం చెప్పారు.. ఇక, వ్యాక్సినేషన్ సెంటర్‌ల వద్ద లైన్ ఉంది.. మందులేదు అంటూ వార్తలు వస్తాన్నాయని మండిపడ్డారు.. నేటి నుంచి 18 ఏళ్లు పైబడినవారికి ఉచిత వ్యాక్సినేషన్ ఇస్తామన్న తరుణ్‌ చుగ్.. 31 డిసెంబర్ నాటికి 200కోట్ల డోసులు అందుబాటులో ఉంచుతామని.. ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ వేయించుకోవాలని సూచించారు.. కరోనాను జయించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించారన్న ఆయన.. ప్రతి ఒక్కరూ కరోనా సోకకుండా ఉండేందుకు మాస్క్ ధరించాలి.. భౌతిక దూరం పాటించాలన్నారు.

Exit mobile version