TG BJP : కమలదళంలో నిధుల సెగ..? తెలంగాణ బీజేపీలో గోల్‌మాల్ గుసగుసలు.!
- తెలంగాణ బీజేపీలో నిధుల గోల్‌మాల్ ఆరోపణలు
- మున్సిపల్ ఎన్నికల ఫండ్స్‌పై హైకమాండ్ సీరియస్
- జిల్లా వారీగా విచారణకు ప్రత్యేక బృందాలు
- నివేదికల తర్వాత పార్టీ లో కీలక మార్పుల సూచనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ బీజేపీలో నిధుల గోల్‌మాల్ గుసగుసలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల కోసం పార్టీ హైకమాండ్ భారీగా నిధులను పంపినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాలు రాకపోవడమే కాకుండా, నిధుల వినియోగంలో పారదర్శకత లోపించిందనే విమర్శలు వస్తున్నాయి. పార్టీ పంపిన నిధులకు మరియు ఎన్నికల్లో వచ్చిన ఓట్లకు, గెలిచిన వార్డులకు ఏమాత్రం పొంతన లేదని ఢిల్లీ నేతలు గుర్తించారు. ఏ, బీ, సీ, డీ కేటగిరీలుగా వార్డులను విభజించి భారీగా ఫండ్ పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. అయితే, పంపిన నిధులను కొందరు నేతలు తమ స్వప్రయోజనాల కోసం ‘బొక్కేశారని’, అభ్యర్థులకు సరైన సమయంలో నిధులు అందలేదని సమాచారం అందడంతో హైకమాండ్ సీరియస్ అయింది.
Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!
Also Read
- Balapur Ganesh Laddu Auction: సరికొత్త రికార్డు.. రూ.39 లక్షలతో బాలాపూర్ గణేశుడి లడ్డూ దక్కించుకున్న సామ ప్రణీత్ రెడ్డి..!
- Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
- Balapur Ganesh: బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాట అప్డేట్..
- AP, Telangana Holiday Today: ఏపీ, తెలంగాణలో నేడు సెలవు.. ఈ జిల్లాల్లో అన్నీ బంద్..
ఈ నిధుల గోల్‌మాల్‌పై ఇప్పటికే ఒకటి రెండుసార్లు పోస్ట్‌మార్టం నిర్వహించిన రాష్ట్ర బీజేపీ ఇన్-ఛార్జ్ అభయ్ పాటిల్, ఇప్పుడు లోతైన దర్యాప్తునకు ఆదేశించారు. నిధులు పక్కదారి పట్టిన విషయంలో ఏం చేయాలనే దానిపై ఆయన సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. ఈ విచారణ కోసం ప్రత్యేకంగా కొందరు నేతలను ఎంపిక చేసి, ఒక్కో జిల్లాకు ఒక్కో నేతను పంపనున్నారు. పార్టీ నియమించిన ఈ నేతలు నేరుగా గ్రౌండ్ లెవల్‌లోకి వెళ్లి, పోటీ చేసిన అభ్యర్థులతో మాట్లాడనున్నారు. వారికి పార్టీ నుంచి అందిన డబ్బులు ఎన్ని? ఆ వార్డు ఏ కేటగిరీలో ఉంది? నిధుల పంపిణీలో పద్ధతి ప్రకారం జరిగిందా లేదా? వంటి అంశాలపై వీరు ఆరా తీయనున్నారు.
నివేదిక అందిన తర్వాత బాధ్యులైన వారిపై ఖచ్చితంగా చర్యలు ఉంటాయని అభయ్ పాటిల్ భరోసా ఇచ్చారు. కేవలం నిధుల విషయమే కాకుండా, పార్టీ శిక్షణ తరగతులు ఎలా జరుగుతున్నాయి మరియు పార్టీ క్రమశిక్షణ వంటి అంశాలపై కూడా పూర్తిస్థాయి రిపోర్టులను అధిష్టానం కోరినట్లు సమాచారం. ఈ నివేదికల అనంతరం తెలంగాణ బీజేపీలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Balapur Ganesh: బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాట అప్డేట్..
-
Joshna Chinappa History: ఏడు ఏషియన్ గేమ్స్.. ఆరు పతకాలు.. 40 ఏళ్ల వయసులోనూ జోష్నా జోరు!
-
PM SVANidhi: వీధి వ్యాపారులకు బంపర్ ఆఫర్.. 50 రోజుల వరకు రూపాయి వడ్డీ లేకుండా లోన్.. అప్లై చేసుకోండిలా..
-
Balapur Ganesh Laddu Auction: సరికొత్త రికార్డు.. రూ.39 లక్షలతో బాలాపూర్ గణేశుడి లడ్డూ దక్కించుకున్న సామ ప్రణీత్ రెడ్డి..!
-
How to Choose Sweet Apples: యాపిల్ కొనేటప్పుడు రంగు చూసి మోసపోవద్దు.. తియ్యటి పండు కోసం సింపుల్ చిట్కాలు
-
Explainer: తడిసి మోపెడు.. ఆస్పత్రులకు వెళ్తే జేబుకు పెద్ద సైజు చిల్లు..!
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!