Amla Murabba: తెల్ల జుట్టుకు చెక్.. మెరిసే చర్మానికి కేరాఫ్ అడ్రస్.. అమ్మమ్మల కాలం నాటి సీక్రెట్ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amla Murabba: ఆయుర్వేదంలో ఉసిరికాయకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. విటమిన్-సి పుష్కలంగా ఉండే ఉసిరిని రోజూ తీసుకోవడం వల్ల చర్మం నిగారింపును సంతరించుకోవడమే కాకుండా, జుట్టు బలంగా పెరుగుతుంది. అయితే ఉసిరిలోని వగరుతనం వల్ల చాలామంది దీనిని తినడానికి ఇష్టపడరు. అలాంటి వారి కోసం వగరు లేకుండా, తేనెలాంటి రుచితో సంవత్సరం పాటు నిల్వ ఉండే ‘ఆమ్లా మురబ్బా’ను సింపుల్‌గా ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: INCA: ఐఎన్సీఏ అవార్డ్స్..ఉత్తమ నటుడుగా నాగ చైతన్య!
Also Read
- Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో 'క్రిస్పీ బైట్స్'.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
- Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే "వెజ్ ఆమ్లెట్".. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
- Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
- Kakarakaya Vepudu: అన్నంలోకి 'కాకరకాయ వేపుడు'.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
కావలసిన పదార్థాలు:
ఉసిరికాయలు – అర కేజీ
బెల్లం – 300 గ్రాములు (2 కప్పులు)
నిమ్మరసం – 1 టీస్పూన్
నల్ల ఉప్పు (Black Salt) – అర టీస్పూన్
జీలకర్ర పొడి – అర టీస్పూన్
ఉప్పు – చిటికెడు
తయారీ విధానం..
ముందుగా ఉసిరికాయలను శుభ్రంగా కడిగి, మరుగుతున్న నీళ్లలో వేసి 15-20 నిమిషాల పాటు ఉడికించాలి. ఇలా నీళ్లలో ఉడికించడం వల్ల ఉసిరిలోని వగరుతనం చాలా వరకు తగ్గుతుంది. ఉసిరికాయ రేకులు విడివడే వరకు ఉడికించడం ముఖ్యం. ఉడికిన ఉసిరికాయలు చల్లారిన తర్వాత, వాటిపై ఉండే పల్చటి పొరను తీసేసి, గింజలను వేరు చేసి ముక్కలుగా చేసుకోవాలి. తర్వాత ఈ ముక్కల్లో నిమ్మరసం, ఉప్పు, నల్ల ఉప్పు, జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి. ఇందులోకి జీలకర్ర పొడికి బదులుగా సొంటి పొడి లేదా యాలకుల పొడిని కూడా వాడుకోవచ్చు. అనంతరం ఒక గిన్నెలో తురిమిన బెల్లం, ఉసిరి ముక్కలను వేసి మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి ఉడికించాలి. బెల్లం కరిగి ముదురు తీగ పాకం వచ్చే వరకు (సుమారు 20-30 నిమిషాలు) ఉడికించాలి. తయారైన మురబ్బా పూర్తిగా చల్లారిన తర్వాత తేనె లాంటి చిక్కదనానికి వస్తుంది. దీనిని గాజు సీసాలో భద్రపరుచుకుంటే బయట ఆరు నెలలు, ఫ్రిజ్‌లో పెడితే ఏడాది పాటు నిల్వ ఉంటుంది.
ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..
ఉసిరిలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచి, ఇన్‌ఫెక్షన్లు, జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి రక్షణ కల్పిస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా సీజన్ మారేటప్పుడు వచ్చే వ్యాధులను అడ్డుకుంటుందన్నారు. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు రక్తాన్ని శుద్ధి చేస్తాయి. ఇది చర్మంపై ముడతలు, మచ్చలను తగ్గించి సహజమైన మెరుపును ఇస్తుంది. మురబ్బాలోని యాంటీ ఏజింగ్ లక్షణాలు మిమ్మల్ని ఎక్కువ కాలం యవ్వనంగా ఉంచుతాయి. జుట్టు రాలడం, తెల్లబడటం వంటి సమస్యలకు ఉసిరి ఒక వరం అని, ఇది జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి, జుట్టు ఒత్తుగా, నల్లగా పెరగడానికి సహాయపడుతుందన్నారు. లోపలి నుంచి పోషణ అందించడం వల్ల జుట్టుకు సహజమైన కండిషనర్ లా పనిచేస్తుందని చెప్పారు.
ఉసిరిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. దీనిని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు తగ్గుతాయి. తిన్న ఆహారం త్వరగా జీర్ణమవ్వడానికి ఇది బాగా దోహదపడుతుందన్నారు. మనం ఈ మురబ్బాను బెల్లంతో తయారు చేస్తున్నాం కాబట్టి, ఇందులో ఐరన్ (ఇనుము) శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచి, రక్తహీనత సమస్యను దూరం చేస్తుందన్నారు. ఉసిరి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దీనివల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది, గుండె జబ్బుల ప్రమాదం కూడా తగ్గుతుంది. కంటి చూపు మందగించడం, కళ్లు ఎర్రబడటం వంటి సమస్యలతో బాధపడేవారికి ఉసిరి ఎంతో మేలు చేస్తుందని, ఇది కంటి నరాలను బలోపేతం చేసి చూపును కూడా మెరుగుపరుస్తుందన్నారు. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ ఉసిరి మురబ్బాను మీకు ఖాళీ ఉన్నప్పుడు మీ ఇంట్లో తయారు చేసుకోండి.
READ ALSO: Raaka: అల్లు అర్జున్ ‘రాకా’ లో ‘శివగామి’.. ఫస్ట్ లుక్‌తోనే సెన్సేషన్!
తాజావార్తలు
-
Sheraz Mehdi: బెదిరింపులకు వెనక్కి తగ్గను.. 100 ప్రెస్మీట్లు, ర్యాలీలకైనా సిద్ధం!
-
JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
-
Woman Sarpanch Candidate Promises: నన్ను గెలిపించండి.. మీ పెళ్లి చేసే బాధ్యత నాది..! సర్పంచ్ అభ్యర్థి హామీ వైరల్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Dhruv Rathee: సీజేపీ నిరసనకు ముందు ఉత్కంఠ.. పోలీసుల అదుపులో ధ్రువ్ రాఠీ..
ట్రెండింగ్
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!