Site icon NTV Telugu

Telangana DSC: టీచర్ ఉద్యోగ అభ్యర్థులకు శుభవార్త.. 6 నెలల్లో మెగా డీఎస్సీ..!

Ts Dsc

Ts Dsc

Telangana DSC: తెలంగాణ రాష్ట్రంలో తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, 6 నెలల్లో మెగా డీఎస్సీ ప్రకటిస్తామని గవర్నర్‌ తమిళిసై తెలిపారు. ఇక టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళన మొదదలైందని గవర్నర్ వెల్లడించారు. నిన్న ఉభయ సభలనుద్దేశించి ప్రసగించిన గవర్నర్‌ మెగా డీఎస్సీపై స్పష్టత ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం ఉద్యోగ నియామకాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే.. ఈ క్రమంలోనే మెగా డీఎస్సీ వేసేలా అడుగులేస్తోంది. కాగా.. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి పర్ఫెక్ట్ ప్లాన్స్ చేసి సక్సెస్ అయ్యేందు రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు సీఎం కుర్చీలో కూర్చొని ప్రజల మెప్పు పొందే నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్న ఆయన.. రాష్ట్రంలోని నిరుద్యోగుల సమస్యలపై కూడా దృష్టి సారించారు. కాగా.. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం ఉద్యోగ నియామకాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే..

Read also: CM Revanth Reddy: త్వరలోనే కొత్త రేషన్‌ కార్డులు.. రేవంత్ సర్కార్‌ చర్యలు

గతంలో వాయిదా పడిన పరీక్షలు.. కొత్త నియామకాలపై తీవ్రగా కసరత్తులు చేస్తున్నారు. అయితే.. ఈ క్రమంలోనే డీఎస్సీపై కూడా త్వరలోనే స్పష్టమైన ప్రకటన చేయబోతున్నారనేది సమాచారం. ఇక..తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా డీఎస్సీ నోటిఫికేష‌న్ విడుద‌ల తేదీని కూడా పొందుప‌రిచింది. ఈనేపథ్యంలో.. నోటిఫికేష‌న్ కోసం డీఎస్సీ అభ్య‌ర్థులు ఎదురుచూస్తున్నారు. కాగా.. తెలంగాణ రాష్ట్రంలో వీలైనంత త్వరగా మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీని వీలైనంత త్వరగా అమలు అయ్యోలా కృషి చేస్తానని ప్రొ. కోదండరాం పేర్కొన్నారు. కాగా.. రాష్ట్ర డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం ఆధ్వర్యంలో మెగా డీఎస్సీ సాధన పేరిట హైదరాబాద్‌ లోని దిల్‍సుఖ్‍నగర్‌లో తాజాగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గ‌త ప్ర‌భుత్వం పదేళ్లలో విద్యారంగం భ్రష్టు పట్టిందని అన్నారు. అయితే దాన్ని బలోపేతానికి అందరూ పాటు పడాలని ప్రొ. కోదండరాం కోరారు. కాగా.. గతంలో మూసివేసిన 6 వేల ప్రభుత్వ పాఠశాలలను తెరిపిస్తే కనీసం 6 వేల ఉపాధ్యాయ పోస్టులు వస్తాయని అన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు ఫీజులు చెల్లించే భారం తగ్గుతుందన్నారు.
Anganwadi Strike: ఏపీలో ఐదో రోజు కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె

Exit mobile version