Telangana BJP Chief Bandi Sanjay Fired On CM KCR
ఉద్యోగులకు జీతాలే ఇవ్వలేనోడు రైతులను ఎట్లా ఆదుకుంటారు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. బుధవారం కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగ ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం యూరియా, డీఏపీ, కిసాన్ సమ్మాన్ నిధి పేరిట ఏటా రెండు పంటలకు కలిపి ఒక్కో ఎకరాకు రూ.41 వేల మేరకు సాయం అందిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చెప్పారు. రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వం మాత్రం రైతు బంధు మాత్రమే ఇచ్చి అన్ని రకాల సబ్సిడీలను బంద్ చేసి రైతులను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు.
రాష్ట్ర ఆర్దిక పరిస్థితిని సర్వనాశనం చేశారన్నారు. ఉద్యోగులకు జీతాలే ఇవ్వలేని కేసీఆర్ రైతులను ఏ విధంగా ఆదుకుంటారో ఆలోచించాలని కోరారు. బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో బండి సంజయ్ కుమార్ తోపాటు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షులు సురేష్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్ రెడ్డి, రంగారెడ్డి రూరల్ జిల్లా అధ్యక్షులు బొక్కా నర్సింహారెడ్డి, మోర్చా రాష్ట్ర నేతలు పాపయ్య గౌడ్, మదుసూధన్ రెడ్డి, తిరుపతిరెడ్డి, కిరణ్, అంజయ్య యాదవ్, కిష్టారెడ్డి, తిరుపతిరెడ్డి తదితరులు హాజరయ్యారు.