Site icon NTV Telugu

Swachh Bharat Mission: స్వచ్ఛభారత్‌లో తెలంగాణ రాష్ట్రానికి మరోసారి అవార్డుల పంట

Swachh Bharat

Swachh Bharat

Swachh Bharat Mission: గ్రామీణ స్వచ్ఛభారత్‌ మిషన్‌లో తెలంగాణ రాష్ట్రానికి మరోసారి అవార్డుల పంటపండింది. స్వచ్ఛ భారత్ మిషన్‌లో అద్భుత ప్రదర్శనతో దేశంలో అత్యుత్తమంగా తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. వివిధ కేటగిరీల్లో 13 స్వచ్ఛ అవార్డులు రాష్ట్రానికి దక్కాయి. జిల్లాల కేటగిరిలో రెండో స్థానంలో జగిత్యాల, మూడోస్థానంలో నిజామాబాద్‌ జిల్లాలు నిలిచాయి. అలాగే స్వచ్ఛ్‌ సర్వేక్షన్‌ గ్రామీణ్‌ సౌత్‌ కేటగిరిలో నిజామాబాద్‌కు రెండోస్థానం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మూడో ర్యాంక్‌ను సాధించింది. ఈ అవార్డులను అక్టోబర్ 2న స్వచ్ఛభారత్ దివస్ సందర్భంగా రాష్ట్రపతి అందజేయనున్నారు. పెద్ద రాష్ట్రాల జాబితాతో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది.

BJP MP Laxman: తెలంగాణ ఉద్యమ సమయంలో మీ ఆస్తులెన్ని?.. ఇప్పుడు మీ ఆస్తులెన్ని?

రాష్ట్రానికి 13 అవార్డులు వచ్చాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. తెలంగాణకు అవార్డులు రావడంపై గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ వల్లే రాష్ట్రానికి అవార్డులు వచ్చాయన్నారు. ప్రశంసలు, అవార్డులు ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. రాష్ట్రాన్ని ఉన్నత స్థాయిలో నిలిపేందుకు కృషిచేసిన అందరికీ కృతజ్ఞతలు చెప్పారు. అవార్డులు, రికార్డులతో పాటు కేంద్రం నిధులు కూడా ఇవ్వాలని కోరారు.

Exit mobile version