తెలంగాణాలో వీధికుక్కల దాడిలో ఇప్పటికే చాలా మంది చిన్నారులు మృతి చెందారు.. ఇప్పుడు మరో దారుణం జరిగింది.. రెండు నెలల చిన్నారి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో దాడి చేసింది. ఈ దాడిలో చిన్నారి ముఖం పై, తలపై తీవ్రంగా గాయపరిచింది.. ఈ దారుణ ఘటన తెలంగాణ కామారెడ్డిలో వెలుగు చూసింది.. మాచారెడ్డి మండలం అంకిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని గుంటి తండాలో చోటుచేసుకుంది..
తండాకు చెందిన భానోత్ సురేష్ జ్యోతి దంపతులు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా వీధి కుక్క ఇంట్లోకి చొరబడి ఇంట్లో నిద్రిస్తున్న రెండు నెలల బాబు ముఖంపై తలపై తీవ్రంగా గాయపరిచి బాబును ఇంట్లో నుంచి బయటకు లాక్కెళ్తున్న క్రమంలో వెంటనే మేల్కొన్న తల్లిదండ్రులు కుక్కను వెంబడించారు. అంతలోపే కుక్క బాబు ముఖంపై,తలపై తీవ్రంగా గాయపరిచింది.. అందరు కుక్కను చుట్టు ముట్టడం తో బాబును వదిలేసింది..
ఈ దాడిలో బాబు ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావంలో ఉన్న బాబును చూసి తల్లిదండ్రులు వెంటనే చుట్టుపక్కల వారికి సమాచారం చేరవేయంతో బాబును చికిత్స నిమిత్తం కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం బాబు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బాబు ముఖంపై గాయపరచడంతో ముఖంపై శస్త్ర చికిత్సకు సుమారు పది లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు సూచించడంతో ఆర్థికంగా ఆదుకోలంటూ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.తండాలో వీధి కుక్కలు తరచుగా తిరుగుతూ దాడి చేస్తున్నాయని గతంలో పంచాయతీ అధికారరులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ప్రస్తుతం వారి రోదనలు అందరిని కంటతడి పెట్టిస్తున్నాయి.. ఇప్పటికే ఎంతో మంది పిల్లలపై కుక్కలు దాడి చేసాయి.. ఒకవైపు అధికారులు కుక్కలను పట్టుకుంటున్నా కూడా ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరం..