Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోరు చివరి దశకు చేరుకుంది. పోలింగ్ ప్రక్రియ ముగియడంతో… పార్టీల భవితవ్యం ఈవీఎంలలో చిక్కుకుంది. ఫలితాలు డిసెంబర్ 3న వస్తాయి. అయితే ఇప్పటికే చాలా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చాయి. వీటిలో కాంగ్రెస్ హవా ఉందని అధికారం కూడా ఆ పార్టీదేనని తేలింది. అయితే ప్రధాన పార్టీలైన బీఆర్‌ఎస్, బీజేపీ మాత్రం మరోలా వాదిస్తున్నాయి. అధికారంలోకి రాబోతున్నామని గులాబీ శ్రేణులు చెబుతుంటే.. ఫలితాలు మాత్రం భిన్నంగా ఉంటాయని బీజేపీ అంచనా వేస్తోంది. హంగ్ వస్తే తామే కింగ్ మేకర్ అవుతామని ఎంఐఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఎవరి లెక్కలు వారివే…!
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రధాన పార్టీలు లెక్కలు వేస్తున్నాయి. కాంగ్రెస్ విషయానికొస్తే.. తమ పార్టీ 70 నుంచి 80 సీట్లు గెలుచుకుంటుందని గట్టి విశ్వాసం వ్యక్తం చేస్తోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ మ్యాజిక్ ఫిగర్ క్రాస్ అవుతుందని అంటున్నారు. అయితే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా కాంగ్రెస్ పార్టీ నేతల వాదనకు బలం చేకూర్చేలా ఉన్నాయి. పోలింగ్ సరళితో పాటు ఓటింగ్ శాతంపై అభ్యర్థులతో చర్చలు జరుపుతున్నారు. ప్లాన్ ఎ వర్కవుట్ కాకపోతే, కాంగ్రెస్ ప్లాన్ బిని కూడా సిద్ధం చేస్తోంది. సింగిల్ గా అధికారంలోకి రాకుండా మ్యాజిక్ ఫిగర్ కు దూరమైతే ఏం చేయాలనే దానిపై లోతైన చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే ఎమ్మెల్యేలను క్యాంపులకు తరలించే అవకాశం కూడా ఉంది.
బీఆర్‌ఎస్ విజయంపై ధీమా వ్యక్తం చేసింది..
బీఆర్‌ఎస్ వాదన మరోలా ఉంది. తెలంగాణలో తామే అధికారంలోకి వస్తామని చెబుతున్నారు. ఈ విషయంలో పార్టీ అధినేత కేసీఆర్ కూడా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది. పోలింగ్ అనంతరం నాయకులు, అభ్యర్థులతో మాట్లాడి గెలుపుపై ఆందోళన చెందవద్దని సూచించారు. అయితే ఎగ్జిట్ పోల్స్ ను పట్టించుకోవద్దని… అసలైన ఫలితాలే విజయం సాధిస్తాయని ఆ పార్టీ నేతలు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఫలితాలు వెలువడిన మరుసటి రోజే కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం ఉంటుందని ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.
బీజేపీ..
బీజేపీ లెక్కలు వేరు. ఈ ఎన్నికల్లో రెండంకెల సీట్లు గెలుస్తామన్న భావనలో ఆ పార్టీ నేతలు ఉన్నారు. గతంతో పోలిస్తే… చాలా స్థానాల్లో భారీ ఓట్లు రావడంతో పాటు మరిన్ని సీట్లు గెలుస్తామని అంచనా వేస్తున్నారు. హంగ్ వచ్చే అవకాశం ఉందని లెక్కలు వేస్తున్నారు. ఎంఐఎం పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందని చెప్పారు. నిజంగా హంగ్ వస్తే కింగ్ మేకర్స్ అవుతామనే భావనలో మజ్లిస్ నేతలు కూడా ఉన్నట్లు వినికిడి.
మొత్తం మీద డిసెంబర్ 3న ఫలితాలు రానున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు అనుసరించాల్సిన వ్యూహాలపై లెక్కలు వేసుకుంటున్నాయి.. తమ ప్లాన్ ప్రకారం సాగితే పార్టీల నిర్ణయాలు వన్ వే అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లేకుంటే మరొకటి అవుతుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమైతే కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని, అంతే కాకుండా హంగ్ వస్తే తెలంగాణ వేదికగా కొత్త తరహా రాజకీయాలకు బీజం పడే అవకాశం లేకపోలేదు!
Hyper Aadi: రాత్రి పది తర్వాత సుధీర్ ఇలాంటి పనులు చేస్తాడా?.. సుధీర్ గుట్టు రట్టు చేసిన ఆది..