సుడిగాలి సుధీర్, హైపర్ ఆది ల స్నేహం గురించి అందరికీ తెలుసు.. వీరిద్దరి కామెడీ టైమింగ్ ను జనాలు ఇష్టపడుతున్నారు.. సుడిగాలి సుధీర్.. టీవీ షోస్ మానేసి సినిమాల్లో హీరోగా చేస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన నటించిన కాలింగ్ సహస్త్ర మూవీ శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. సినిమాకి మిశ్రమ స్పందన లభిస్తుంది. అయితే తన సినిమా ప్రమోషన్స్ కోసం మళ్లీ ఈటీవీకి వచ్చాడు. అక్కడ ఉన్న ఆది సుధీర్ గురించి కొన్ని నమ్మలేని విషయాలను చెప్పి అందరికీ షాక్ కు గురి చేశాడు..
ఆది నవ్వుతూనే సుధీర్ గురించి అతి పెద్ద రహస్యం బయటపెట్టాడు. జబర్దస్త్ షోలో డబుల్ మీనింగ్ డైలాగ్‌లతో పంచ్‌లు, సెటైర్లు పేల్చి నవ్వించారు హైపర్ ఆది, సుధీర్. కానీ ఇద్దరికి ఏడాది గ్యాప్ వచ్చింది. సుధీర్ హీరోగా బిజీ కావడంతో జబర్దస్త్ వదిలేశాడు. ఆది కూడా కొన్నాళ్లు ఆ షోని వీడారు. చాలా రోజులు తర్వాత ఈ ఇద్దరు కలవడంతో మళ్లీ పాత ట్రాక్ లోకి వెళ్లారు.. దాంతో ఇద్దరు కలిసి కాసేపు కామెడీ చేశారు.. అదే సమయంలో ఆది సుధీర్ గుట్టు రట్టు చేశాడు..
ఆయన రాత్రిళ్లు ఏం చేస్తాడో మొత్తం చెప్పేశాడు. రాత్రి 10.30 వరకే కాలింగ్ సహస్త్ర అని.. పదిన్నర దాటిందా.. కాలింగ్ గీత, కాలింగ్ సరళ.. ఫస్ట్ కాలింగ్.. ఆ తర్వాత కూలింగ్. ఆ తర్వాత లింగడి లింగడి లింగడి.. అంటూ అసలు విషయం చెప్పాడు ఆది.. ఇక సుధీర్ కూడా అతనికి తగ్గట్లుగానే రెచ్చిపోయాడు. మధ్యలో యాంకర్ ప్రదీప్ కూడా ఎంట్రీ ఇవ్వడంతో వీరి సంభాషణ కామెడీగా సాగింది.. ఇక షోలో ఓ వైపు తన విషయం బయటకు రావడంతో సుధీర్ నిర్వహకులను వేడుకున్నాడు. మళ్లీ వచ్చి తప్పు చేశాను. క్షమించమని వేడుకున్నారు. ప్రస్తుతం ఢీ లేటెస్ట్ ఎపిసోడ్‌కి చెందిన ప్రోమో యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతుంది..