Telangana-Amazon Tieup: అమేజాన్ వెబ్ సర్వీసెస్ సంస్థ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయనుంది. మరింత ఆధునిక సాంకేతికతను ప్రవేశపెట్టడం ద్వారా పౌర సేవల రంగంలో సమూల మార్పులు తేనుంది. కంప్యూటింగ్, స్టోరేజ్, మేనేజ్మెంట్, గవర్నెన్స్ క్యాపబిలిటీస్‌లో అమేజాన్ వెబ్ సర్వీసెస్ సొల్యూషన్స్‌ను వినియోగించనున్నారు. గతంలో డిజిటల్ ఇండియా, కొవిడ్ వ్యాక్సిన్ ఇంటలిజెన్స్ నెట్‌వర్క్ వంటి కేంద్ర ప్రభుత్వ కీలక ప్రాజెక్టులపై పనిచేసిన ఈ సంస్థ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో టైఅప్ అవటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా అమేజాన్ సంస్థ హైదరాబాద్‌లో డేటా సెంటర్లను ఏర్పాటుచేయనుంది.
గ్రోత్ అయిన క్రెడిట్
దేశంలోని కమర్షియల్ బ్యాంకుల క్రెడిట్ గ్రోత్ దాదాపు 9 ఏళ్ల గరిష్టానికి చేరింది. ఆగస్టు 26వ తేదీ నాటికి 15 పాయింట్ 5 శాతానికి పైగా పెరిగినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. 2013 నవంబర్ 1న అత్యధిక క్రెడిట్ గ్రోత్ 16 పాయింట్ 1 శాతం నమోదు కాగా ఆ తర్వాత ఎప్పుడూ ఈ స్థాయికి రాలేదు. అయితే క్రెడిట్ గ్రోత్ 20 శాతానికి చేరటం అనేది సవాల్‌గా మారినట్లు మార్కెట్ మరియు ఫైనాన్షియల్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ లక్ష్యాన్ని అందుకోవాలంటే ఆర్థిక రంగం శరవేగంగా దూసుకుపోవాలని, మరీ ముఖ్యంగా పారిశ్రామిక రంగం బాగా విస్తరించాలని సూచించాయి.
Sruti Hassan: శ్రుతి హాసన్ చేసిన ఆపనికి షాక్ అయిన అభిమానులు
పన్నుల వసూళ్లు భళా
గతేడాదితో పోల్చితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 35.5 శాతం పెరిగాయి. దీంతో ఈ నెల 8వ తేదీ నాటికి 6 పాయింట్ నాలుగు ఎనిమిది ట్రిలియన్ రూపాయలకు చేరాయి. ఇదే సమయంలో ఒకటీ పాయింట్ ఒకటీ తొమ్మిది ట్రిలియన్ రూపాయల రిఫండ్లు చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ చెల్లింపులు గతేడాది కన్నా ఏకంగా 65 శాతానికి పైగా ఎక్కువని తెలిపింది. నెట్ కార్పొరేట్ ట్యాక్స్ 32 శాతానికి పైగా మరియు పర్సనల్ ఇన్‌కం ట్యాక్స్ 28 శాతానికి పైగా వసూలయ్యాయని వివరించింది.