NTV Telugu Site icon

Amit shah flight: అమిత్ షా వెళ్లే విమానంలో సాంకేతిక సమస్య.. హైద్రాబాద్‌లోనే..

Amithsaha

Amithsaha

Amit shah flight: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. మరో ఫ్లైట్‌ ఏర్పాటు చేసుకున్న తర్వాత కొచ్చికి బయలుదేరుతారు. అప్పటి వరకు ఆయన రాత్రి బస చేసిన నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ (ఎన్ఐఎస్ఏ)లోనే ఉంటారు. ఆయన వెంట బండి సంజయ్, కిషన్ రెడ్డి, మరికొందరు బీజేపీ నేతలు ఉన్నారు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. సీఐఎస్ఎఫ్ రైజింగ్ డేలో పాల్గొనేందుకు కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన సీఐఎస్‌ఎఫ్‌ రైజింగ్‌ డే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈరోజు ఉదయం 11:40 గంటలకు కొచ్చి షా బయలుదేరాల్సి ఉంది.

Read alsso: Mallu Bhatti Vikramarka: నా.. రూటే వేరు.. రేవంత్ రూట్‌ వేరు

అయితే అమిత్ షా ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. అక్కడ పార్టీ నేతలతో భేటీ కావాల్సి ఉంది. అంతలో ఆయన వచ్చిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఆయన షెడ్యూల్ వాయిదా పడింది. ఈ విషయం తెలుసుకున్న అధికారులు విమానంలో సాంకేతిక సమస్యపై మంత్రి అమిత్ షాకు వివరించారు. దీంతో అమిత్ షా హైదరాబాద్ లోనే ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ బీజేపీ నేతలు కేంద్ర మంత్రి అమిత్ షాను కలిశారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడంపై పార్టీ నేతలు అమిత్ షాతో చర్చించారు. ఇక బీఆర్ఎస్ వ్యూహను ఎదుర్కొనేందుకు అవలంభించాల్సిన వ్యూహంపై బీజేపీ నేతలకు అమిత్ షా దిశా నిర్ధేశం చేశారని సమాచారం. అంతకు ముందు సీఐఎస్ఎఫ్ 54వ రైజింగ్ డేలో పాల్గొన్న అమిత్ షా.. సీఐఎస్ఎఫ్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ 53 ఏళ్లుగా దేశ సేవలో సీఐఎస్‌ఎఫ్‌ కీలకపాత్ర పోషిస్తోందన్నారు. సీఐఎస్‌ఎఫ్ డ్రోన్ టెక్నాలజీని మరింత బలోపేతం చేయనున్నారు. దేశ సేవలో ప్రాణాలర్పించిన సీఐఎస్ఎఫ్ జవాన్లకు అమిత్ షా నివాళులర్పించారు.
Komatireddy Venkat Reddy: భట్టి పాదయాత్రకు మీరు రండి.. నేను వస్తా..!

Show comments