Site icon NTV Telugu

Harassment : సాప్ట్ వేర్ దంపతులకు పోకిరీల వేధింపులు

Attack

Attack

రోజు రోజుకు సమాజంలో బాధత్యారహితంగా వ్యవహరిస్తున్న కొందరు యువకులు.. చెడు అలవాట్లకు బానిసలుగా మారి.. మత్తులో తామేం చేస్తున్నామో తెలియకుండా ఘోరాలకు పాల్పడుతున్నారు. అయితే.. గత రాత్రి హైదరాబాద్‌లోని చైతన్యపురిలో పోకిరీలు వీరంగం సృష్టించారు. ఉద్యోగానికి వెళ్లి వస్తున్న భార్యభర్తలను అడ్డుకొని వేధింపులకు గురి చేశారు. అంతేకాకుండా భార్యను వేధిస్తున్న పోకిరీలకు అడ్డువచ్చిన భర్తపై దాడికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే..
సాప్ట్ వేర్ ఇంజనీర్ దంపతుల చైతన్యపురిలో ఉంటున్నారు.

అయితే గత రాత్రి డ్యూటీ ముగించుకొని ఇంటికి తిరిగివస్తున్న వారిని.. చైతన్యపురి రోడ్డుపై పోకిరీలు ఆపేశారు. అంతేకాకుండా భార్యను వేధించడంతో భర్త అడ్డుకునేందకు ప్రయత్నించాడు. దీంతో పోకిరీలు ఇనుప రాడ్లతో, కర్రలతో దంపతులపై విచక్షణ రహితంగా దాడి చేశారు. దీంతో బాధిత దంతపతులు చైతన్యపురి పోలీసులను అశ్రయించారు. బాధితులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version