NTV Telugu Site icon

Teacher Transfers: తెలంగాణలో 18, 942 ఉపాధ్యాయులకు ప్రమోషన్లు..!

Telangana

Telangana

Teacher Transfers: ఈ నెల 8వ తేదీన ఉపాధ్యాయుల బదిలీ, పదోన్నతుల ప్రక్రియ జరిగింది. పదవీ విరమణకి మూడు సంవత్సరాల లోపు ఉన్న వారికి తప్పనిసరి బదిలీ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలంగాణ సర్కార్ ప్రకటించింది. పండిట్, పీఈటీ పోస్ట్ లని అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు ప్రకటించింది. గతంలో కోర్టు కేసులతో ఎక్కడ అయితే బదిలీ, పదోన్నతుల ప్రక్రియ ఆగిపోయిందో అక్కడి నుంచే పాఠశాల విద్యా శాఖ కొనసాగించింది. టెట్ తో సంబంధం లేకుండానే ప్రమోషన్లు ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెడీ అయింది. కోర్టులో కేసు నడుస్తుండగా మళ్ళీ ఇబ్బందులు రాకుండా చకచకా బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అధికారులు పూర్తి చేశారు.

Read Also: KCR Driving: ఓమ్నీ వ్యాన్ నడిపిన కేసీఆర్.. నెట్టింట ఫోటోలు వైరల్..

అయితే, టీచర్ల బదిలీలు, పదోన్నతులను దృష్టిలో పెట్టుకొని ఖాళీ అయ్యే పోస్టులను పరిగణనలోకి తీసుకునే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ వేసింది. ప్రస్తుతం జరుగుతున్న పదోన్నతులు, బదిలీల్లో 18 వేల 942 మంది టీచర్లకి ప్రమోషన్ రానుంది. సెకండరీ గ్రేడ్ టీచర్ నుంచి స్కూల్ అసిస్టెంట్ గా 17 వేల 72 మందికి పదోన్నతి లభించనుంది. స్కూల్ అసిస్టెంట్ నుంచి హెడ్ మాస్టర్ గా 1870 మందికి పదోన్నతి వచ్చింది. ఇక, ఎస్జీటీ బదిలీలు మినహా టీచర్ల పదోన్నతి, బదిలీల ప్రక్రియ పూర్తి అయింది.