Shocking : నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం కుద్వాన్‌పూర్ ప్రాథమిక పాఠశాలలో దారుణ ఘటన వెలుగుచూసింది. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు శంకర్, రెండో తరగతి విద్యార్థులపై కర్కశంగా ప్రవర్తించాడు. అల్లరి చేస్తున్నారనే కారణంతో చిన్నారుల కళ్లలో, చెవుల్లో కారం పోసాడు. ఈ ఘటనతో పిల్లలు తీవ్రంగా విలవిల్లాడారు. ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయుడిని నిలదీశారు.
Coolie : ‘కూలీ’లో పాత్ర అన్యాయం అంటూ ప్రచారం.. స్పందించిన శృతిహాసన్..
కానీ, అతడు అక్కడి నుంచే తప్పించుకున్నాడు. దీంతో గ్రామస్థులు, తల్లిదండ్రులు కలసి ఎంఈవో కార్యాలయానికి వెళ్లి ఉపాధ్యాయుడిపై ఫిర్యాదు చేశారు. ఒక ఉపాధ్యాయుడి నుంచి ఇలాంటి అమానుష చర్య వెలుగుచూడటంతో పాఠశాల వాతావరణం, పిల్లల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చిన్నారులపై ఇలాంటి హింస అసలు సహించలేనిదని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు భయపడి పాఠశాలకు వెళ్లేందుకు కూడా ఇష్టపడటం లేదని స్థానికులు చెబుతున్నారు.
Alliance Airlines: అలయన్స్ ఎయిర్ లైన్స్ విమానంలో సాంకేతిక లోపం.. మూడు సార్లు రన్‌వేపైకి వెళ్లి..!
