Site icon NTV Telugu

Aishwarya dead body: హైదరాబాద్‌కు చేరిన తాటికొండ ఐశ్వర్య మృతదేహం..

Tatikonda Aishwarya

Tatikonda Aishwarya

Aishwarya dead body: మే 6న టెక్సాస్‌లోని ఓ మాల్‌లో కాల్పుల ఘటనలో మృతి చెందిన తాటికొండ ఐశ్వర్య మృతదేహం హైదరాబాద్‌కు చేరుకుంది. ఆమె మృతదేహాన్ని స్వదేశానికి తరలించడంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) కీలక పాత్ర పోషించింది. అయితే అందుకు అవసరమైన లాంఛనాలు పూర్తి చేసి మృతదేహాన్ని భారత్‌కు పంపినట్లు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రతినిధి కొల్లా అశోక్ బాబు తెలిపారు.

Read also: Ustaad: ఫస్ట్ లుక్ అదిరింది… హరీష్ శంకర్ కి గుడి కట్టినా తప్పులేదు రా…

శనివారం మధ్యాహ్నం టెక్సాస్‌లోని ప్రీమియం అవుట్‌లెట్ మాల్‌లో ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 9 మంది మృతి చెందగా, చిన్నారులు సహా పలువురు గాయపడ్డారు. ఈ కాల్పుల్లో తెలంగాణకు రంగారెడ్డి జిల్లాకు చెందిన తాటికొండ ఐశ్వర్య మృతి చెందినట్లు అమెరికా అధికారులు నిర్ధారించారు. ఐశ్వర్య కుటుంబం హైదరాబాద్‌లోని కొత్తపేటలో నివాసం ఉంటోంది. ఆమె తండ్రి నర్సిరెడ్డి రంగారెడ్డి జిల్లా కోర్టు మెజిస్ట్రేట్. కొన్నేళ్ల క్రితం ఐశ్వర ఉన్నత చదువుల కోసం అమెరికాలోని టెక్సాస్‌ వెళ్లింది. మే 18 ఐశ్వర్య పుట్టినరోజు. దీంతో ఆమె బర్త్ డే పార్టీని గ్రాండ్ గా చేయాలని కంపెనీ ప్లాన్ చేసింది. అయితే… ఆ పార్టీకి డ్రెస్ కొనుక్కోవడానికి ఐశ్వర్య మే 6న అలెన్ మాల్‌కు వెళ్లింది. ఇంతలో ఆమె వెళ్లిన మాల్ లో ముష్కరులు కాల్పులు జరిపారు. మాల్‌లో దుండగులు జరిపిన కాల్పుల్లో ఆమె తీవ్రంగా గాయపడింది. ఐశ్వర్య ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో ఐశ్వర్య కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. డల్లాస్‌కు ఉత్తరాన 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న విశాలమైన షాపింగ్ కాంప్లెక్స్‌లో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 9 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. కాల్పుల అనంతరం షాపింగ్ మాల్‌లోని కస్టమర్లు, ఉద్యోగులు ప్రాణాల కోసం పరుగులు తీశారు. అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని హతమార్చారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
Jeevan Case: ఇన్‌స్టా పోస్ట్‌ పెట్టిన 8 గంటల్లోనే.. అనుమానాస్పద స్థితిలో ఇంజినీరింగ్‌ విద్యార్థి మృతి

Exit mobile version