NTV Telugu Site icon

Tarun Chugh : నేడు, రేపు నాలుగు జిల్లాల నేతలతో సమీక్ష

Telangana BJP Incharge Tarun Chugh Review Meetings Today and Tomorrow.

తెలంగాణలో రాజకీయ పార్టీలు రాబోయే ఎన్నికల కోసం వ్యూహాలు పన్నుతున్నాయి. ఎన్నికలకు మందుగానే ప్రజల్లోకి వెళ్లి వాళ్లతో మమేకమవడం కోసం ప్రయత్నలు సాగిస్తున్నాయి. దానికి కేడర్‌లను, కార్యకర్తలను చైతన్య పరుస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేసేందుకు అడుగులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేడు, రేపు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌ తరుణ్ చుగ్‌ తెలంగాణలోని పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన నాలుగు జిల్లాల నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. బీజేపీ జిల్లా పదాధికారులు, మండల అధ్యక్షులు, ఇంచార్జ్ లతో ఈ సమీక్షలో పాల్గొననున్నారు.

అయితే మోర్చాల జిల్లా అధ్యక్షులు, ఇంచార్జ్, ముఖ్యనేతలతో, జిల్లా కోర్ కమిటీ తో విడివిడిగా తరుణ్‌ చుగ్‌ సమావేశం కానున్నారు. ముందస్తు ఎన్నికలు ప్రచారం నేపథ్యంలో పార్టీ బలోపేతం, సంసిద్ధత పై సమీక్షించనున్నారు. ఈ రోజు వికారాబాద్ లో వికారాబాద్ జిల్లా పై, నారాయణ పేట లో సాయంత్రం నారాయణ పేట జిల్లా సమీక్షతో పాటు రేపు మేడ్చల్ అర్బన్, రంగారెడ్డి రూరల్ జిల్లాల పై సమీక్ష నిర్వహించనున్నారు.