Cpm Jana Chaitanya Yatra: బీజేపీ మతోన్మాద, కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా సంక్షేమం, మత సామరస్యం, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం కోసం అంటూ సీపీఎం అఖిల భారత కమిటీ పిలుపులో భాగంగా తెలంగాణలో నేటి నుంచి జన చైతన్య యాత్ర ప్రారంభం కానుంది. బహిరంగ సభకు వరంగల్ లోని ఆజంజాహిమిల్లు గ్రౌండ్లో ఏర్పాట్లు చేశారు. ఉదయం 10 గంటలకు ఆజంజాహి మిల్లు గ్రౌండ్ లో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి యాత్రను ప్రారంభించనున్నారు. అనంతరం జరిగే సభలో ప్రసంగించనున్నారు. యాత్రకు పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్ నాయకత్వం వహిస్తారు. యాత్ర హనుమకొండ, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల నుంచి ప్రయాణించి 29న హైదరాబాద్ ముగింపు సభతో ముగుస్తుంది.
Read also: Tsrtc Special buses: టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. 50 మంది విద్యార్థినులకో బస్
కాగా.. రాజ్యాంగ హక్కు ల పరిరక్షణకు సీపీఎం కేంద్ర కమిటీ చేపట్టే ప్రచార కార్యక్రమం రాష్ట్రంలోని మూడుచోట్ల ప్రారంభించనున్నట్టు తెలిపారు. నేడు వరంగల్‌లో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఈనెల 23న ఆదిలాబాద్‌లో సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు.. 24న నిజామాబాద్‌లో మాజీ ఎంపీ విజయరాఘవన్ కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఇక.. 29న హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద జనచైతన్య యాత్ర ముగింపు సభ నిర్వహిస్తామని చెప్పారు. అయితే.. ఈ కార్యక్రమానికి తమ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ప్రకాశ్‌కారత్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తమ్మినేని వీరభద్రం వివరించారు. కాగా.. బీజేపీ మతోన్మాద, కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా, సంక్షేమం, మత సామరస్యం, సామాజిక న్యాయం కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో నేటి నుంచి ఈ నెల 29 వరకు జనచైతన్య యాత్రలు నిర్వహించనున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వెల్లడించారు.
Maharashtra: మహారాష్ట్రలో 12వ తరగతి ఫిజిక్స్, కెమిస్ట్రీ పేపర్లు కూడా లీక్