మునుగోడు బరిలో టీఆర్‌ఎస్ దూకుడు సిద్దమైంది. మొన్న సీపీఐ టీఆర్‌ఎస్ కు మద్దతు పలుకగా.. నేడు సీపీఎం మద్దతు ప్రకటించడంపై చర్చనీయాంశంగా మారింది. బీజేపీని ఓడించేందుకే టీఆర్ ఎస్‌కు మద్దతు తెలుపు తున్నట్లు అటు సీపీఐ ఇటు సీపీఎం పార్టీలు ప్రకటించడంతో.. సర్వత్రా ఉత్కంఠంగా మారింది. తాజాగా బీజేపీలో వెంకట్‌రెడ్డి రాజగోపాల్ రెడ్డి కషాయి కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. ఆగస్టు 21 అమిత్ షా సమక్షంలో ఆయన బీజేపీ లో చేరారు. కాంగ్రెస్ లో ఇన్ని రోజులు వుండి ఏమీ చేయలేక పోతున్నానని తన రాజీనామాతో అయితే టీఆర్‌ఎస్ తమ పథకాలను విడుదల చేయాలని పేర్కొంటూ బీజేపీలో చేరి మునుగోడు బరిలో దిగేందుకు సన్నాహాలు మొదలయ్యాయి.
దీంతో అమిత్ షా సభ కన్నా ముందు రోజే ఆగస్టు 20న టీఆర్ ఎస్ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. తన పక్కా వ్యూహంతో ముందుకెళుతున్న సమయంలో సీపీఐ తమకు మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించింది. దీంతో టీఆర్‌ఎస్ సభలో మరింత ఉత్సాహాన్ని నింపింది. అయితే ఇవాళ టీఆర్‌ఎస్ కు మద్దుతు తెలుపుతున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. బీజేపీని ఓడించేందుకు టీఆర్ఎస్‌కు మద్దతు ప్రకటించనట్లు తమ్మినేని స్పష్టం చేశారు. మునుగోడు ఎన్నిక విషయంలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నుండీ మద్దతు కావాలని విజ్ఞప్తులు వచ్చాయని తెలిపారు. రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు మునుగోడులో బీజేపీ ఓడించడానికి టీఆర్‌ఎస్ కు మద్దతు ఇస్తున్నామని తెలిపారు.
రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తూ నియోజకవర్గ అభివృద్ధి కోసం రాజీనామా అన్నారు. టీఆర్ఎస్ నియోజకవర్గానికి అన్యాయం చేస్తే కాంగ్రెస్ కి ఎందుకు రాజీనామా చేశారని ప్రశ్నించారు తమ్మినేని. మునుగోడు సభలో అమిత్షా బీజేపీని గెలిపించండి గెలిపించిన నెల రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని బహిరంగంగా చెప్పారు. పూర్తి మెజారిటీతో ఉన్న ప్రభుత్వాన్ని నెల రోజుల్లో ఎలా పడగొడతారు? అంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యేలను కొనేయడం,ఈడీ తో బెదిరింపులు చేయడం,రాజ్యాంగ సంస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతున్నారని విమర్శించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆరెస్ vs కాంగ్రెస్ మరే అవకాశం ఉంది. దానిని టీఆరెస్ vs బీజేపీ గా మార్చాలని బీజేపీ ప్లాన్ చేస్తుందని అన్నారు. బలమున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజీనామా చేస్తే మూడవ ప్లేస్ కి వెళ్లే పరిస్థితి వచ్చిందని అన్నారు.
మునుగోడు ఎన్నికల ఫలితం ఎలా వచ్చిన టీఆర్ఎస్ వ్యతిరేక శక్తులు బీజేపీలో చేరేలా ప్లాన్ చేసారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. రాజకీయాలను వక్రమార్గం లో దేశాన్నిన్ని మతతత్వ రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. బీజేపీ ప్రభావాన్ని తెలంగాణ లోని పార్టీలు తక్కువ అంచనా వేస్తున్నాయని, ఉత్తర భారతదేశంలో వారి ఆగడాలు చూస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో 5 సార్లు గెలిచిన సీపీఐతో కలిసి పోటీ చేస్తే ఎలా ఉంటుందన్న దానిపై చర్చించామన్నారు. బీజేపీని ఓడించడానికి ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు లేదని, అందుకే టీఆర్ఎస్కి మద్దతు ఇస్తున్నామన్నారు. సీపీఐలాగా మేము దీర్ఘకాలిక నిర్ణయాలు తీసుకోలేదని అన్నారు. మునుగోడు వరకే మామద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. కేసీఆర్ బీజేపీ కి వ్యతిరేకంగా చేస్తున్న రాజకీయాలు స్వాగతిస్తున్నామని తమ్మినే అన్నారు.
ఇక తెలంగాణతో టీఆర్ఎస్‌తో రాజకీయ సంబంధాలు లేకపోయినా, బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఓపెన్ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని సీపీఐ నారాయణ తెలిపిన విషయం తెలిసిందే. అయితే.. మునుగోడు ఉప ఎన్నిక బీజేపీ అగ్రనాయకత్వం నాటకంలో భాగంగానే వచ్చిందన్నారు. దీంతో.. ఏపీలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే వారికే సీపీఐ మద్ధతు ఉంటుందని కుండబద్దలుకొట్టారు నారాయణ. కాగా.. బీజేపీకి వైసీపీ, టీడీపీ, జనసేన భజన చేస్తున్నాయని విమర్శించారు నారాయణ. ఇక దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక శక్తుల బలోపేతానికి కృషి చేస్తామని, భారత దేశ సమాఖ్య వ్యవస్థను బీజేపీ సర్వనాశనం చేస్తోందని నారాయణ విమర్శించారు.
Vishaka Group Politics YCP : అక్కడ అధికార పార్టీలో సిట్టింగ్ సీట్ నిలబెట్టుకోవడం అంత వీజీ కాదా..?
