Tammineni Veerabhadram Gives Clarity On Alliance With BRS Party: రాబోయే ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్‌కు మద్దతు ఇస్తామని, సీఎం కేసీఆర్ సూచనలతో ముందుకు సాగుతామని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని గద్దెదించడమే లక్ష్యంగా.. తమ పార్టీ ముందుకు సాగుతుందని అన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను తమ సీపీఎం పార్టీ ఎప్పటికప్పుడు ఎండగడుతూ తిప్పికొడుతుందని ఉద్ఘాటించారు. బీజేపీ మతోన్మాద రాజకీయాలు, కార్పొరేట్ శక్తులను వ్యతిరేకిద్దాం.. ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం కోసం పోరాడుదామనే సంకల్పంతో.. సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన జనచైతన్య యాత్ర నల్లగొండకు చేరుకుంది.
Upasana Konidela: భార్య ఒడిలో కూర్చొని గ్లోబల్ స్టార్ నవ్వులు.. ఇంటర్నెట్ ను షేక్ చేసే పిక్
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. బీజేపీని ఓడించేందుకే తాము బీఆర్ఎస్‌కు మద్దతు ఇస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. భవిష్యత్తులో బీజేపీని వ్యతిరేకించే పార్టీలను కలుపుకొని.. బలమైన పోరాటాలకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. ప్రజా సంపదను మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతుందని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన బుద్ధి చెబుతామని, మోడీని ప్రధాని గద్దె నుంచి దింపడమే లక్ష్యంగా కమ్యూనిస్టు పార్టీలు పని చేస్తాయని అన్నారు. బీజేపీ ప్రభుత్వం తీరు వ్యవసాయాన్ని నాశనం చేసేలా ఉందని.. అందుకు వ్యవసాయ చట్టాలే నిదర్శనమని పేర్కొన్నారు. ఆ చట్టాలను రద్దు చేయాలని బలమైన పోరాటం సాగిందని, ఆ పోరాటంతోనే కేంద్రం వెనక్కు తగ్గిందని తెలియజేశారు.
Rahul Gandhi: రాహుల్ గాంధీకి మరో షాక్.. ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని నోటీసులు
బీజేపీ మళ్లీ కేంద్రంలో అధికారంలోకి వస్తే.. బ్రిటిష్ వారు సాగించిన పాలనని చూస్తామని, అది ఎంతో ప్రమాదకరమైందని తమ్మినేని హెచ్చరించారు. మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెడుతున్న బీజేపీకి.. తెలంగాణ రాష్ట్రంలో స్థానం లేదని తేల్చి చెప్పారు. కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ.. ప్రభుత్వ సంస్థలను తెగనమ్ముకుంటున్నారని విమర్శించారు. గత 8 సంవత్సరాల కాలంలో.. మోడీ ప్రభుత్వం రూ.100 లక్షల కోట్ల అప్పులను చేసిందని తెలిపారు. కాగా.. మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు కమ్యూనిస్టు పార్టీలు మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే!