కేంద్ర ప్రభుత్వంపై మరోసారి పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆయన మాట్లాడుతూ.. బీజేపీ నేతలు మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని కేంద్రంపై మండిపడ్డారు. ‘హిందూస్థాన్, పాకిస్థాన్’ అనేది బీజేపీ జీవితకాల నినాదమని, ‘వీరి నాయకులకు జ్ఞానం లేదని’ ఆయన ఆరోపించారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన తలసాని.. గత మూడేళ్లలో హైదరాబాద్‌కు కిషన్ ఏం చేశారని ప్రశ్నించారు. వరద సాయం కోసం కూడా కిషన్ ఒక్క రూపాయి కూడా హైదరాబాద్‌కు తీసుకురాలేదు.
తెలంగాణపై భాజపా కక్షపూరితంగా వ్యవహరిస్తుంటే ప్రధాని ముచ్చింతలకు రావడం దుర్మార్గమని తలసాని అన్నారు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఐటీఐఆర్ తీసివేసిందని, కిషన్‌రెడ్డి తెలియదా.. ఐటీఐఆర్ వస్తే ఎంతో మంది ఉద్యగాలు వస్తాయని..? అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ నేతలు ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడాలని ఆయన హెచ్చరించారు. బీజేపీ నేతల డ్రామాలు ప్రజలు చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రజావ్యతిరేక పాలనకు రోజులు దగ్గరపడ్డాయని ఆయన ధ్వజమెత్తారు.
