NTV Telugu Site icon

Talasani Srinivas Yadav: తెలంగాణలో హంగు, బొంగు ఏమీ రాదు

Talasani On Alliance

Talasani On Alliance

Talasani Srinivas Yadav Reacts On BRS Congress Alliance: తెలంగాణలో హంగు, బొంగు ఏమీ రాదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో పొత్తు ఉండదని, వచ్చే ఎన్నికల్లో తాము పూర్తి మెజార్టీతో గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. అయినా.. తాము పోయి పోయి కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటమా? అయిన మాకు పొత్తు పెట్టుకునే అవసరం ఏముంది? అని తిరిగి ప్రశ్నించారు. తమతో పోటీ పడే వాళ్ళు తెలంగాణలో లేరని తేల్చి చెప్పారు. వామపక్షాలతో పొత్తుపై కేసీఆర్ మాట్లాడతారని అన్నారు. బీఆర్ఎస్ బండి ఫుల్ లోడ్ అయి ఉందన్నారు. సికింద్రాబాద్, అంబర్‌పేట్ పార్లమెంట్ నియోజకవర్గాలకు కిషన్ రెడ్డి ఏ నిధులు తీసుకొచ్చారో చెప్పాలని నిలదీశారు. అంబర్‌పేటలో అభివృద్ధి గురించి కిషన్‌రెడ్డితో చర్చించడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కారు వెంకటేశ్ సిద్ధంగా ఉంటారన్నారు. ఇక ఈటల బీఆర్ఎస్‌లోకి రావడంపై తానేం చెప్పలేనని, బీఆర్ఎస్‌లోకి ఎప్పుడొస్తారో ఈటలనే అడగండని అన్నారు.

Bare Foot Walking: చెప్పులు లేకుండా నడిచారా.. ఒకసారి ట్రైచేసి చూడండి

కడపలో స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు ఈసీ అనుమతి ఇచ్చిందని.. కానీ తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభంకు అనుమతి ఇవ్వలేదని తలసాని మండిపడ్డారు. వ్యవస్థలు ఎటు పోతున్నాయని ప్రశ్నించారు. ఇదే సమయంలో ఇటీవల సచివాలయంలో జరిగిన అగ్నిప్రమాదంపై వివరణ ఇచ్చారు. కార్మికులు చలి కాచుకునే సమయంలో ఆ ప్రమాదం చోటు చేసుకుందని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్‌లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నారని.. ఈ వేడుకల్ని బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ఆయా నియోజకవర్గాల్లో నిర్వహిస్తారని తలసాని స్పష్టం చేశారు. కాగా.. ఢిల్లీలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యాక తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని, అప్పుడు ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్‌తో చేతులు కలుపుతారని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే! అందుకు బదులుగానే పై విధంగా తలసాని స్పందించారు.

ICC Rankings: టెస్టుల్లోనూ నెంబర్‌వన్.. కెప్టెన్‌గా రోహిత్ సరికొత్త చరిత్ర