దేశంలో ఎక్కడ లేని విధంగా అభివృద్ధి చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనని మంత్రి తలసాని శ్రీనివాస్ అన్నారు. సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తున్నాం.రాష్ర్టంపై కేంద్రం నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తుంది. రైతాంగం నడ్డి విరిచే చట్టాలను తీసుకొచ్చారు. 700 మంది మరణించిన తర్వాత ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసం పార్లమెంట్‌లో చర్చ లేకుండానే చట్టాలను ఉపసంహరించుకున్నారు. ఎవరిని ఉద్ధరించడానికి ఇవ్వన్ని చేస్తున్నారు. ఎలక్షన్ లు వస్తున్నాయి వెనక్కి తీసుకున్నారా దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు బంధును అమలు చేస్తున్న ఘనత తెలంగాణదే అన్నారు. ఓ వైపు రాష్ర్టంలో బీజేపీ నేతలు వరి పంట కొనుగోలుపై కేంద్రంతో మాట్లాడే దమ్ములేక అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. కొన్ని రాజకీయ పార్టీలకు పబ్లిసిటీ పిచ్చి పట్టిందన్నారు. 365 రోజులు నీళ్ళు ఉండేలా అపర భగీరథుడిలా సీఎం కేసీఆర్ చేశాడు.
ఈ ప్రభుత్వం చేసిన నీళ్ళు, కరెంటు ద్వారా రైతులు కష్టపడి పంట పండిస్తే తీసుకోమని కేంద్ర ప్రభుత్వం చెప్పిందన్నారు. ఎదో ఫేవర్ చేయాలి అని అడగడం లేదు… ఫుడ్ గ్రైన్స్ కొనాలి అనేది చట్టం చెబుతుందన్నారు. కరోనా వైరస్ సమయంలో 23 లక్షల మందికి భోజనం పెట్టి వారి స్వస్థలలకు పంపామని, అది మా భాధ్యత కాకపోయినా చేశామని మంత్రి అన్నారు. పొలిటికల్ అన్ ఎంప్లాయ్ లు ఈరోజు దీక్షలు చేస్తున్నారు. బీజేపీ మేనిఫెస్టోలో 2 కోట్ల జాబ్ లు ఇప్పిస్తామని అన్నారు.. చర్చకు రెడీ నేను ఎక్కడ ఇచ్చారో చెప్పాలన్నారు. స్టీల్ బ్రిడ్జిలు కానీ, ఫుట్ పాత్, లింక్ రోడ్ లు కాని, కనెక్టివిటీ గానీ ఎక్కడైనా ఉందా ఇలా .. కేటీఆర్ అబ్బాయి చదువుకునే అబ్బాయి.. అలా మాట్లాడడం కరెక్టేనా..? మానవత్వం లేకుండా నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడడమేనా ..? సీఎంను ఏక వచనంతో సంబోధిస్తారా.. ?ఏం మేము మాట్లాడలేమ…మాకు 60 లక్షల బలగం ఉందని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
