Site icon NTV Telugu

Talasani Srinivas Yadav : కందికొండ మరణించడం చాలా బాధాకరం

Talasani-srinivas-yadav

Minister Talasani Srinivas Yadav Condolence to Lyricist Kandikonda Yadagiri Passes away.

ప్రముఖ కవి, గేయ రచయిత కందికొండ మరణంతో తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. సినీ ప్రముఖులతోపాటు రాజకీయ నేతలు కూడా ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తున్నారు. ‘తెలంగాణ సబ్బండ వర్గాల సంస్కృతిని తన పాట ద్వారా అజరామరంగా నిలిపిన, వరంగల్‌ బిడ్డ కందికొండ మరణం, తెలంగాణ సాహిత్య లోకానికి సబ్బండ వర్గాలకు తీరని లోటు’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొనియాడారు. పాటల రచయితగా తెలుగు సినీ సాహిత్య రంగంలో తనదైన ముద్రను సృష్టించిన తెలంగాణ బిడ్డ కందికొండ అని స్మరించుకున్నారు. ఆయనను కాపాడుకునేందుకు ప్రభుత్వం పలు ప్రయత్నాలు చేసినా ఫలించలేదని అవేదన వ్యక్తం చేస్తూ కందికొండ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

అయితే తాజాగా సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ కూడా కందికొండ మృతికి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన .. కందికొండ యాదగిరి మరణించడం చాలా బాధాకరమన్నారు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో గొప్ప పాటలు రాశారని, తెలంగాణ సమాజం, ఉద్యమం కోసం పాటలు రాశారన్నారు. కుటుంబానికి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందని, తెలంగాణ సమాజానికి తీరని లోటని ఆయన వ్యాఖ్యానించారు. కందికొండ కుటుంబానికి ప్రభుత్వం తరపున ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

https://ntvtelugu.com/parliament-sessions-2nd-phase-from-tomorrow/
Exit mobile version