Site icon NTV Telugu

Talasani Srinivas Yadav : బడ్జెట్‌తో సంబంధం లేకుండా గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తాం

Talasani Srinivas Yadav

Talasani Srinivas Yadav

గణపతి ఉత్సాల నిర్వహణపై సమావేశం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించి. సెప్టెంబర్‌ 19 నుంచి 28 వరకు గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు జరుగనున్నాయి. అయితే.. ఈనేపథ్యంలో గణేష్ ఉత్సవాలపై మంత్రి తలసాని అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పలువురు మంత్రులు, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. దేశంలో హైదరాబాద్‌లో ఎంతో ఘనంగా గణేష్ ఉత్సవాలు జరుగుతాయని ఆయన అన్నారు. 30 వేలకు పైగా వినాయక విగ్రహాలు తయారు అవుతాయని ఆయన పేర్కొన్నారు.

Also Read : Pooja Hegde: బుట్టబొమ్మకు సర్జరీ.. ఎంతో కాలం నుంచి ఆ నొప్పితో బాధపడుతున్న పూజా

గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు వినాయక పండుగ సజావుగా జరిగేందుకు కృషి చేస్తారని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున గడిచిన 9 ఏళ్ల పాటు అన్ని మతాల పండుగలను ఘనంగా నిర్వహించామని ఆయన తెలిపారు. నిమజ్జన కార్యక్రమం శోభాయామానంగా జరుగుతుందని, వినాయక నిమజ్జనం కోసం తాత్కాలిక చెరువులను ఏర్పాటు చేస్తామని మంత్రి తలసాని వెల్లడించారు. వినాయక నిమజ్జనం, మిలాద్ ఉన్ నబి ఓకే రోజు వస్తున్నాయని, ఆ రోజు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాటుకు చేస్తుందని ఆయన అన్నారు. బడ్జెట్ తో సంబంధం లేకుండా గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తామని ఆయన అన్నారు. మన తెలంగాణ పండుగ సాంప్రదాయం దేశ విదేశాలకు విస్తరించిందని, మండపాల పర్మిషన్ లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తున్నామన్నారు.

Also Read : Maharashtra: దారుణం.. ఆ కారణంతో నలుగురు దళితులను చెట్టుకు వేలాడదీసి కొట్టారు

సమావేశం అనంతరం భాగ్య నగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ.. గత ఏడాది లాగే ఈసారి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తామని ప్రభుత్వం అధికారులకు చెప్పారని, గణేష్ పూజా విధానం తెలిపే బుక్ తో పాటు పూజా సామాగ్రిని భక్తులకు ఇవ్వాల్సిందిగా వారు తెలిపారు. వినాయక మండపాలు కు పోలీస్ పర్మిషన్ తప్పనిసరి కాదని, స్థానిక పోలీస్ స్టేషన్‌లో చెప్పితే సరిపోతుందన్నారు. రాజకీయ నాయకులు గణేష్ ఉత్సవాల్లో ఫ్లెక్సీలో పెడుతున్నారని, సుప్రీం కోర్టు ఇప్పటికే ఫ్లెక్సీలను నిషేధించిందని, ఈ సారి కూడా రాజకీయ నాయకుల ఫ్లెక్సీలను పెట్టొద్దని మంత్రికి చెప్పామన్నారు. ఈ నెల 19న వినాయక చవితిగా నిర్ణయించామని, సూర్యోదయం ఆధారంగా వినాయక చవితిని 19న నిర్ణయించామన్నారు. 28న వినాయక నిమజ్జనం ఉంటుందని, గణేష్ ఉత్సవాలకు ముఖ్య మంత్రిని రావాలని కోరామన్నారు.

Exit mobile version