NTV Telugu Site icon

సంతకం ఫోర్జరీ చేసి ఆరు కోట్ల విలువైన స్థలం కబ్జా…

తహసీల్దార్ సంతకం ఫోర్జరీ చేసి ఆరు కోట్ల విలువైన స్థలం కబ్జా చేసారు. ఖాజాగూడ సర్వే నెంబర్ 27 గల ప్రభుత్వ స్థలానకి జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి సర్కిల్ లో అక్రమ మార్గాన ఇంటి నెంబర్ తీసుకుని, తహసీల్దార్ సంతకం ఫోర్జరీ చేసి NOC సృష్టించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కబ్జారాయుళ్ళు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు కబ్జాదారుల పై పోలీసులకు ఫిర్యాదు చేసారు. దాంతో కబ్జారాయుళ్ళను అరెస్ట్ చేసి కటకటాల్లోకి పంపారు గచ్చిబౌలి పోలీసులు. ఖాజాగూడకు చెందిన సంగం రాజు గౌడ్, కొమరగౌని శ్రీనివాస్ గౌడ్, ఈశ్వర్ గౌడ్ లను అరెస్ట్ చేసారు.