Site icon NTV Telugu

Rain Alert : కొన్ని గంటల్లో కుండపోత.. వాతావరణ శాఖ కీలక హెచ్చరిక

Rain

Rain

Rain Alert : గత నాలుగు ఐదు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలు వర్షాలతో తడిసి ముద్దవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో కుండపోత వర్షాలు నగర జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షంతో యూసఫ్‌గూడ, కృష్ణానగర్, శ్రీనగర్ కాలనీలలో వరదలు ముంచెత్తి వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి.

ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా ఉప్పల్, ఎల్బీనగర్ సహా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తూనే ఉంది. పంజాగుట్ట, బేగంపేట, అమీర్‌పేట్, జూబ్లీహిల్స్, సికింద్రాబాద్ వంటి ప్రాంతాల్లో రహదారులపై నీరు నిలిచిపోయింది. జీహెచ్ఎంసీ సిబ్బంది అప్రమత్తంగా ఉండి, లోతట్టు ప్రాంత ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తోంది.

కొత్త ఔట్ ఫిట్ లో జాన్వీ కపూర్ పిక్స్ చూడాల్సిందే మరి….

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే రెండు మూడు గంటల్లో హైదరాబాద్‌ సహా రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఇప్పటికే బోడుప్పల్, మేడిపల్లి, పీర్జాదిగూడ, కుత్బుల్లాపూర్, బహదూర్‌పురా ప్రాంతాల్లో వర్షం పడుతోంది. పలు చోట్ల ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని పేర్కొంది.

మహబూబాబాద్, సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి, మంచిర్యాల, నిజామాబాద్, హన్మకొండ, వరంగల్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో రాత్రి వరకు వర్షాలు కొనసాగుతాయని అంచనా. నల్గొండ, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, ఆసిఫాబాద్ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు.

AI replacing Keyboard and Mouse: ఐదేళ్ల తర్వాత మౌస్-కీబోర్డ్ అవసరమే ఉండదట.. మైక్రోసాఫ్ట్ సంచలనం

Exit mobile version