Swapnalok Complex Fire : సికింద్రాబాద్‌లో కలకలం.. మళ్లీ మంటల్లో స్వప్నలోక్.!
- అకస్మాత్తుగా చెలరేగిన భారీ అగ్నిప్రమాదం
- దట్టమైన పొగతో బయటకు పరుగులు
- రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది
- పాత ప్రమాదం మళ్లీ గుర్తుచేసిన ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Swapnalok Complex Fire : సికింద్రాబాద్‌లోని ప్రముఖ వ్యాపార సముదాయం స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో గురువారం మరోసారి అగ్నిప్రమాదం సంభవించి తీవ్ర కలకలం రేపింది. కాంప్లెక్స్ నుంచి అకస్మాత్తుగా భారీగా మంటలు, దట్టమైన పొగలు వ్యాపించడంతో లోపల ఉన్న వ్యాపారులు, సందర్శకులు భయాందోళనలతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, ఫైర్ టెండర్ల సహాయంతో మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. దట్టమైన పొగ కారణంగా సహాయక చర్యలకు కొంత ఆటంకం ఏర్పడినప్పటికీ, లోపల ఎవరైనా చిక్కుకున్నారా అనే కోణంలో అధికారులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. కాంప్లెక్స్ లోని మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ముందుగా.. వ్యాక్స్ కన్సల్టింగ్ సొల్యూషన్స్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కార్యాలయంలో దేవుడికి పెట్టిన దీపం ద్వారా వైర్లకు అంటుకొని షార్ట్ సర్క్యూట్ జరిగినట్లు అగ్నిమాపక అధికారులు భావిస్తున్నారు.
గతంలో కూడా ఇదే స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగి పెద్ద ఎత్తున ఆస్తి నష్టంతో పాటు ప్రాణనష్టం సంభవించిన సంగతి తెలిసిందే. ఆ చేదు జ్ఞాపకాలు ఇంకా మరువక ముందే, నిబంధనల అమలులో నిర్లక్ష్యం కారణంగా మళ్లీ అదే భవనంలో ప్రమాదం పునరావృతం కావడంపై స్థానికులు, వ్యాపారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవనంలో సరైన అగ్నిమాపక రక్షణ ఏర్పాట్లు లేకపోవడమే ఈ వరుస ప్రమాదాలకు కారణమనే విమర్శలు వ్యక్తమవుతుండగా, ప్రస్తుత ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు , నష్ట తీవ్రతకు సంబంధించిన పూర్తి వివరాలు అగ్నిమాపక సిబ్బంది విచారణ అనంతరం తెలియాల్సి ఉంది.
Also Read
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
తాజావార్తలు
-
Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
-
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
-
Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!