NTV Telugu Site icon

Jagadish Reddy: రేవంత్ రెడ్డికి బతుకమ్మ పాట వింటే వణుకు పుడుతుంది..

Jagdish Reddy

Jagdish Reddy

Jagadish Reddy: సీఎం రేవంత్ రెడ్డి ది అట్లతద్దె.. అందుకే బతుకమ్మ పాట వింటే సీఎం రేవంత్ రెడ్డికి వణుకు పుడుతుందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికైనా తెలంగాణ మహిళా లోకానికి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వరదలు వచ్చినప్పుడు బీఆర్ఎస్‌ బాధితులకు బాసటగా నిలిచిందని తెలిపారు. సోషల్ మీడియాను, యూట్యూబ్ ఛానల్స్ ను.. ఆపగలరేమో గాని ఉద్యమాలని ఆపలేరన్నారు. దాడులు, కేసులు, నిషేదాలతో బతుకమ్మ పాటను ఆపలేరని తెలిపారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కి ఎప్పుడు ప్రజల్లోకి రావాలో తెలుసని అన్నారు.

Read also: Nalgonda: పోలీస్‌ కస్టడీకి అనుముల తహసీల్దార్‌ జయశ్రీ..

జగదీశ్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి కనకదుర్గమ్మకు పూజలు నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జేజే నగర్‌లోని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి తన సతీమణి సునీతా జగదీశ్‌రెడ్డి, సోదరి కట్టా రేణుకా శేఖర్‌రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ అన్నమల్లపూర్ణతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆశీర్వదించారు. అనంతరం కమిటీ సభ్యులను శాలువా, పట్టువస్త్రాలతో సత్కరించారు. పాడిపంటలతో ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని అమ్మవారిని వేడుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Show comments