Site icon NTV Telugu

Minister Uttam: మంత్రి ఉత్తమ్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..

Uttam

Uttam

Minister Uttam: తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌కు పెను ప్రమాదం తప్పింది. వాతావరణ శాఖ అధికారుల సూచన మేరకు ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయినట్టు తెలిసింది. అయితే, మంత్రి ఉత్తమ్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ హుజూర్‌ నగర్ మండలం మేళ్ల చెరువులో ల్యాండ్ కావాల్సి ఉండగా.. మబ్బులు కమ్ముకోవడం, గాలివాన నేపథ్యంలో పైలట్ అప్రమత్తమయ్యారు. దీంతో, అత్యవసరంగా కోదాడలో ల్యాండ్‌ చేశారు. అనంతరం, మంత్రి ఉత్తమ్ కుమార్‌.. కోదాడ నుంచి హుజూర్ నగర్‌కు రోడ్డు మార్గంలో వెళ్లిపోయారు.

Exit mobile version