తెలంగాణలో రైతుల పరిస్థితి దారుణంగా తయారైంది. ఓ వైపు అకాల వర్షాలతో చేతికొచ్చిన పంట దెబ్బతినగా.. పంటను అమ్ముకున్నాక కూడా రైతులకు అవస్థలు తప్పడం లేదు.. అంటే మూలిగే నక్కపై తాటి పండు పడినట్లు ఉంది ప్రస్తుతం రాష్ట్రంలోని రైతుల పరిస్థితి. కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యం ఆకాల వర్షాల నుంచి కాపాడుకునేందుకు రాత్రింబవళ్లు కాపలా కాస్తున్నారు. అయితే లాస్ట్ కు పంటను అమ్మిన తర్వాత కూడా రైతన్నలకు తిప్పలు మాత్రం తప్పడం లేదు.
Also Read : Tollywood: ఈ వీకెండ్ థియేటర్లలో సందడి చేయబోతున్న సినిమాలు ఇవే!
తాజాగా సూర్యాపేట జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వడ్లను కొనుగోలు చేసిన రైస్ మిల్లర్లు.. ఆ తర్వాత వాటిని మిల్లులకు తీసుకెళ్లడం లేదు.. లారీల కొరత వల్లే ఈ సమస్య తలెత్తింది. దీంతో తమ పంటను అమ్ముకున్నా.. కొనుగోలు కేంద్రాల్లోనే నిల్వ ఉంచే పరిస్థితి నెలకొందని రైతులు బాధపడుతున్నారు. ఈ సమయంలో వర్షం కానీ పడితే అమ్ముకున్న పంటంతా తడిసిపోతుందని వారు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో రైతులే స్వయంగా లారీలను వెతుక్కునే పనిలో పడ్డారు. మిల్లర్లు పంపే లారీ కోసం పడిగాపులు పడలేక.. రోడ్డుపై ఉన్న లారీ యజమానులను, డ్రైవర్లను వేడుకుంటున్నారు.
Also Read : Sachin Pilot: సీఎం అశోక్ గెహ్లాట్ అధిష్టానం సోనియా గాంధీ కాదు వసుంధర రాజే..
లారీల కొతరపై సంబంధిత అధికారులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అకాల వర్షాలతో సగానికి సగం పంట నష్టపోయామని రైతులు వాపోతున్నారు. దీనికి తోడు పంటను అమ్ముకున్న తర్వాత కూడా తమకు కష్టాలు తప్పడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అరుగాలం కష్టపడి, వేలు ఖర్చు పెట్టి పండించిన పంటకు.. చివరకు కనీసం పెట్టుబడైనా వస్తుందో లేదోనని అన్నదాతలు దిగులు చెందుతున్నారు.