Suryapet: అన్నారం ఐకేపీ కేంద్రం వద్ద ఉద్రిక్తత.. రైతు దంపతులు ఆత్మహత్యాయత్నం
- సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో పెట్రోల్ పోసుకొని రైతు కుటుంబం ఆత్మహత్య యత్నం..
- ధాన్యం బాగాలేదని వెనక్కి పంపిన మిల్లు యాజమాన్యం..
- మనస్థాపంతో కొనుగోలు కేంద్రం వద్ద రైతు దంపతులు ఆత్మహత్యాయత్నం..
- అన్నారం గ్రామంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suryapet: ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. ఈనేపథ్యంలో ఐకేపీ కేంద్రంలో నాణ్యతా ప్రమాణాలతో కొనుగోలు చేసి ఎగుమతి చేసిన ధాన్యాన్ని కోదాడ రైస్ మిల్లర్ దిగుమతి చేయకుండా ఐకేపీ కేంద్రానికి తిరిగి పంపారు. దీంతో తీవ్ర మనస్తాపంతో ఎ రైతు దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారంలో చోటుచేసుకుంది.
Read also: KTR Comments: ఈనెల 29 తెలంగాణ ప్రజలు మరిచి పోలేని రోజు..
Also Read
బాధితుల వివరాల ప్రకారం.. తుంగతుర్తి మండలం చౌళ్లతండాకు చెందిన గుగులోతు కీమా నాయక్, పున్నమ్మ దంపతులు అన్నారం గ్రామానికి చెందిన గోగుల రామకృష్ణకు చెందిన భూమిని కౌలుకు తీసుకుని వరి సాగు చేశారు. పండించిన ధాన్యాన్ని ఈనెల మొదటి వారంలో అన్నారం ఐకేపీ కేంద్రానికి పంపించారు. ఎండబెట్టి, తూర్పారబెట్టాక చేసిన తర్వాత వరిలో తేమ శాతం, నాణ్యతను ఏఈవో పరిశీలించి కొనుగోలుకు ఎంపిక చేశారు. ఈ నెల 16న కాంటా వేశారు. కీమాకు చెందిన 425 బస్తాలు, మరో ఇద్దరు రైతులకు చెందిన 263 బస్తాలు కలిపి మొత్తం 688 బస్తాలను ఈ నెల 17న లారీలో ఎగుమతి చేసి కోదాడలోని వెంకటరమణ రైస్ మిల్లుకు ఎగుమతి చేశారు. వరి ధాన్యం నల్లగా ఉందని, దించలేదని మిల్లు నిర్వాహకులు ఈ నెల 18న ఐకేపీ కేంద్రానికి సమాచారం అందించారు. రైతు కీమా, ఐకేపీ నిర్వాహకులు మిల్లుకు వెళ్లి అడగ్గా వడ్లు బాగోలేదని బస్తాకు మూడు కిలోలు తగ్గిస్తామని మిల్లు నిర్వాహకులు తెలిపారు.
రైతు కీమా అంగీకరించడానికి నిరాకరించాడు.. తరుగు తగ్గించకుండా దించమని వారిని వేడుకున్నాడు, కానీ మిల్లు మేనేజర్ అంగీకరించలేదు. తరుగుతీస్తే తాను ఒప్పుకునేది లేదని రైతు తిరిగి వచ్చాడు. మిల్లు నిర్వాహకులు శనివారం ఉదయం ధాన్యాన్ని దించకుండానే ఐకేపీ కేంద్రానికి తిరిగి పంపించారు. ధాన్యం లారీ తిరిగి వచ్చిందని ఐకేపీ నిర్వాహకులు చెప్పారు. దీంతో రైతు కీమా దంపతులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద లారీ వద్దకు రైతు కీమా దంపతులు వెళ్లి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఒంటిపై పెట్రోలు పోసుకుంటున్న సమయంలో సెంటర్‌లోని తోటి రైతులు వారిని చూసి వారి చేతుల్లోని పెట్రోల్ డబ్బాను లాక్కున్నారు. దీంతో వారు స్థానిక తహసీల్దార్ దయానందంకు ఫిర్యాదు చేశారు. వెంటనే తహసీల్దార్ డీటీ కంట్లమయ్య, ఏఓ బాలకృష్ణ, ఏపీఎం రాంబాబు ఐకేపీ సెంటర్‌కు చేరుకున్నారు. రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో మిల్లు యాజమాన్యంతో మాట్లాడి నష్టపోకుండా తిరిగి మిల్లుకు దింపేందుకు పంపించారు. ఆ మిల్లుకు పంపిన ధాన్యానికి బస్తాకు కిలో చొప్పున కోత విధిస్తున్నట్లు చెబుతున్నారు.
Kaushik Reddy: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి నోటీసులు..
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..