NTV Telugu Site icon

Car Door: సైడ్ పార్క్ చేసి కారు డోర్ తీసాడు.. అంతే వచ్చేవాడు చచ్చాడు..!

Car Door

Car Door

Car Door: వాహనాల్లో ప్రయాణించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఒక్కోసారి ఊహించని ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి దారి తీస్తుంది. అజాగ్రత్తగా నడపడం వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎదురుగా వస్తున్న వాటిని గుర్తించకపోవడం ప్రమాదాలకు దారి తీస్తోంది. అలాంటి ఘటనే ఒకటి హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. బైక్‌పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు కారు డోర్‌ను ఢీకొని ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన హైదరాబాద్‌లోని కుషాయిగూడలో చోటుచేసుకుంది.

Read also: Tamil Nadu: కొడుకు చదువు కోసం చావుకు సిద్ధమైంది..

సైనిక్‌పురిలోని రాఘవ గార్డెన్స్‌కు చెందిన సురేష్ తన ఫోన్ రిపేర్ చేయించుకునేందుకు సోమవారం ఈసీఐఎల్‌కు వెళ్తున్నాడు. ఇంతలో డ్రైవర్ రాజూరి జగదీష్ ఈసీఐఎల్ చౌరస్తా సమీపంలో రోడ్డు పక్కన కారును నిలిపాడు. అనంతరం కారు డోర్‌ తెరవగా.. బైక్‌పై కొంత వేగంతో వెనుక నుంచి వస్తున్న సురేష్‌ ఢీకొట్టాడు. కారు డోర్ తగలడంతో సురేష్ బైక్ పై నుంచి కిందపడి స్పృహ కోల్పోయాడు. ఈ ఘటనలో తల, ఇతర శరీర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గుర్తించి వెంటనే సమీపంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. తీవ్రగాయాలు, రక్తస్రావం కావడంతో ఆస్పత్రికి తరలించేలోపే సురేష్ మృతి చెందాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకున్నారు. సరేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Sangareddy: గురుకుల పాఠశాలలో విద్యార్థినిలకు అస్వస్థత.. వాంతులు విరోచనాలు