Site icon NTV Telugu

MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ.. 16కు వాయిదా

Mlc Kaitha

Mlc Kaitha

MLC Kavitha: ఈడీ సమన్లను వ్యతిరేకిస్తూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. దీనిని ఈ నెల 16న విచారించనున్నట్లు జస్టిస్ బేల ఎమ్ త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. నళినీ చిదంబరం, అభిషేక్ బెనర్జీ కేసులతో పాటు కవిత పిటిషన్‌ను కూడా విచారిస్తామని గత విచారణలో సుప్రీంకోర్టు తెలిపింది. సోమవారం విచారణ ప్రారంభమైన తర్వాత ఈ పిటిషన్‌పై తుది విచారణ చేపట్టాలని కవిత తరఫు న్యాయవాది కపిల్ సిబల్ కోర్టును కోరారు. అయితే గతంలో వివిధ కేసుల్లో ఇచ్చిన ఆదేశాలతో పాటు రికార్డులను కూడా పరిశీలించాలని ధర్మాసనం పేర్కొంది. ఈ నేపథ్యంలో విచారణ వాయిదా పడింది. ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ కవిత విచారణకు రావడం లేదని ఈడీ తరపు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. తమకు సమన్లు అందడం లేదని చెప్పారు. ఈడీ సమన్లు చట్టవిరుద్ధమని కపిల్ సిబల్ అన్నారు. గత విచారణలో కవితకు సమన్లు జారీ చేయబోమని ఈడీ కోర్టుకు తెలిపిందని గుర్తు చేశారు. అయితే ఇది ఒక్కసారి మాత్రమేనని, ప్రతిసారీ కాదని ఈడీ న్యాయవాది బదులిచ్చారు. ఈ నెల 16న జరిగే విచారణలో అన్ని అంశాలను విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.

Read also: Top Headlines@1PM: టాప్‌ న్యూస్

అయితే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు విచారణలో భాగంగా బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవితను గత ఏడాది మార్చిలో ఢిల్లీ కార్యాలయంలో ఈడీ అధికారులు మూడు రోజుల పాటు విచారించారు. అధికారుల ఆదేశాల మేరకు.. ఈ విచారణలో భాగంగా గతంలో తాను ఉపయోగించిన సెల్‌ఫోన్లను ఎమ్మెల్సీ కవిత అందజేశారు. మహిళను ఈడీ కార్యాలయంలో కాకుండా తన ఇంట్లోనే విచారించాలని కోరుతూ ఎంఎంఎల్‌ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై విచారణ జరగకముందే.. గత సెప్టెంబర్‌లో ఈడీ అధికారులు ఆమెకు మరోసారి నోటీసులు జారీ చేశారు. దీంతో కవితను నవంబర్ వరకు విచారణకు పిలవరాదని సుప్రీంకోర్టు ఆదేశించింది. కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ దర్యాప్తు వెనక్కి వెళ్లింది. ఇప్పుడు మరోసారి ఈడీ ఒక్కరోజు మాత్రమే గడువు ఇస్తూ నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నందున విచారణకు హాజరు కాలేనని ఎమ్మెల్సీ కవిత ఈడీ అధికారులకు లేఖ రాశారు. తనకు ముందస్తు షెడ్యూల్‌ ఉన్నందున విచారణకు హాజరు కాలేనని ఎమ్మెల్సీ కవిత ఈడీ అధికారులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. దీంతో విచారణకు హాజరు కాలేనని కవిత పంపిన లేఖపై ఈడీ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

IND vs ENG: శ్రేయస్ అయ్యర్‌.. ఇక కష్టమే! మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Exit mobile version