NTV Telugu Site icon

TS RTC: ఆర్టీసీ బస్సుల పై సమ్మర్ ఎఫెక్ట్.. మధ్యాహ్నం సర్వీసుల తగ్గింపు..

Ts Rtc

Ts Rtc

TS RTC: తెలంగాణలో ఎండలు మాడు పగిలేలా మండుతున్నాయి. బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. ఎండప్రభావంతో ప్రయాణాలను కూడా వాయిదా వేసుకుంటున్నారు. మార్చి రెండో వారం నుంచి భానుడి కనిపించింది. ఇక ఏప్రిల్‌ లో ఈ ఎండలు నిప్పుల కొలిమిలా ఉన్నాయి. గత 15 రోజులుగా తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగాయి. ఉదయం 10 గంటల తర్వాత బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు..కానీ బయటకు వెళ్లకుండా పనులు జరగడం లేదు. ఏదైనా పని ఉన్నా ఉదయం..సాయంత్రం చూసుకుంటున్నారు.

ఇక ఈ ఎండలతో ఆర్టీసీ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పైన ఎండ, కింద ఇంజన్ వేడితో డ్రైవర్లు నరకం అనుభవిస్తున్నారు. ఫలితంగా, వారందరూ వడదెబ్బ లేదా ఇతర ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు. రోజురోజుకు సిబ్బంది అనారోగ్యం పాలవుతుండడంతో టీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ పరిధిలో మధ్యాహ్నం పూట బస్సుల సంఖ్య తగ్గిన సంగతి తెలిసిందే. జిల్లాలతో పోలిస్తే గ్రేటర్ హైదరాబాద్‌లో బస్సులు నడపడం డ్రైవర్లకు చాలా కష్టంగా ఉంది. నిత్యం ట్రాఫిక్ జామ్ లు..ఈ క్రమంలో మధ్యాహ్న సమయంలో ఎండ తీవ్రత కూడా ఎక్కువగానే ఉంటోంది.

Read also: Flight Ticket: కేవలం రూ.150కే విమానంలో ప్రయాణించే అవకాశం.. ఎక్కడంటే..?!

ఈ సమయంలో వారికి బస్సులు నడపడం చాలా కష్టంగా మరుతుంది. అందుకే గ్రేటర్‌ హైదరాబాద్‌లో మధ్యాహ్నం బస్సులను తగ్గించాలని ఆర్టీసీ నిర్ణయించింది. రేపటి (ఏప్రిల్ 17) నుంచి మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బస్సుల సంఖ్యను తగ్గిస్తున్నట్లు ఆర్టీసీ తెలిపింది. మధ్యాహ్నం పూట ప్రయాణికులు లేకపోవడంతో సర్వీసులను కుదిస్తున్నామని, డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆర్టీసీ గ్రేటర్ జోన్ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు.

కావున ప్రయాణికులు గమనించాలని కోరారు. ఆర్టీసీ నిర్ణయానికి సహకరించాలని సూచించారు. కానీ సాయంత్రం 4గంటల నుండి అర్థ రాత్రి 12 గంటల వరకు యధావిధిగా సిటీ బస్ సర్వీస్ లు నడపనున్న ఆర్టీసీ ప్రకటించింది. ఈనెల 17 నుండి సిటీ లో మధ్యాహన్నాం వేళల్లో మాత్రమే తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలు వీటిని గమనించి ప్రయాణాలు చేయాలని సూచించారు.
Flight Ticket: కేవలం రూ.150కే విమానంలో ప్రయాణించే అవకాశం.. ఎక్కడంటే..?!