NTV Telugu Site icon

IIT Student: ప్లీజ్ నా డెడ్ బాడీని ఎవరికీ చూపించకండి.. ఐఐటీ విద్యార్థిని సూసైడ్ నోట్..

Iiit

Iiit

IIT Student: నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన కార్తీక్ అనే విద్యార్థి.. వైజాగ్‌లో మృతదేహం లభ్యమైన ఘటనను మరిచిపోకముందే.. మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతుంది. ఐఐటీ హైదరాబాద్‌లో పీజీ ఫస్టియర్ (ఎంటెక్) చదువుతున్న ఒడిశాకు చెందిన మమైతా నాయక్ ఆగస్టు 7వ తేదీ రాత్రి క్యాంపస్‌లోని హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన తోటి విద్యార్థులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మమైత మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే మమైత గదిలో సూసైడ్ నోట్ కూడా లభ్యమైంది. ఆ సూసైడ్ నోట్ ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తోంది.

Read also: మెడ మీద నలుపు ఎంతకీ పోవట్లేదా? ఇలా చేయండి

మమైతా నాయక్ సూసైడ్ నోట్‌లో కీలక అంశాలు వెల్లడయ్యాయి. తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని.. డిప్రెషన్‌తో చనిపోతున్నారని సూసైడ్ నోట్‌లో రాసింది. “ప్లీజ్… నా డెడ్ బాడీని ఎవ్వరికీ చూపించొద్దు.. నా డెడ్ బాడీని కనీసం మా పేరెంట్స్ కి మీడియాకు చూపించొద్దు.. ప్లీజ్ ఇది నా విన్నపం.. నా చావుకి గల కారణాలను విచారించాల్సిన అవసరం లేదు. నా చావుకి కారణం… నేను డిప్రెషన్‌లో ఉన్నాను కాబట్టి.” అని మమైత తన సూసైడ్ నోట్‌లో రాసింది. అయితే.. ఒడిశాకు చెందిన మమైతా నాయక్ అనే బాలిక ఎంటెక్ చదివేందుకు జూలై 26న హైదరాబాద్ ఐఐటీలో చేరింది. అయితే.. కాలేజీలో చేరిన 12 రోజులకే ఆత్మహత్యకు పాల్పడి.. డిప్రెషన్ తో చనిపోతున్నట్లు సూసైడ్ నోట్ రాసి చనిపోవడం అందరినీ కలిచివేసింది. మరోవైపు.. సూసైడ్ నోట్‌లో మమైత చేతిరాత ముత్యాల్లా అందంగా ఉందని.. ఇంత మంచి రాత రాసే అమ్మాయికి ఏం ఇబ్బంది అని అందరూ వాపోతున్నారు.

Read also: The Soul Of Satya: కలర్స్ స్వాతితో సాయి ధరమ్ తేజ్ పెళ్లి..

కాగా, ఐఐటీ విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో ఇప్పటివరకు మొత్తం ఏడుగురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. 2022-23 సంవత్సరంలోనే నలుగురు ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం ఆందోళనకరం. చదువుల ఒత్తిడి తట్టుకోలేకపోతున్నామని విద్యార్థులు సూసైడ్ నోట్లు రాయడం మరింత ఆందోళన కలిగిస్తోంది. గతేడాది ఆగస్టు 31న ఏపీలోని నంద్యాల జిల్లాకు చెందిన రాహుల్ అనే విద్యార్థి క్యాంపస్‌లోని మంచానికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గత ఏడాది సెప్టెంబర్ 6న రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు చెందిన ఐఐటీ పూర్వ విద్యార్థి మెగ్ కపూర్ సంగారెడ్డిలోని లాడ్జిపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Jagtial: కోరుట్ల కౌన్సిలర్ భర్తపై కత్తులతో దాడి..! ఆ నాగరాజు ఎవరు?