హైదరాబాద్ పాతబస్తీలో మరోసారి స్ట్రీట్ ఫైట్ వ్యవహారం కలకలం సృష్టించింది… ఈ సారి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మొఘల్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని అంధేరి గల్లీలో మసీదు నుంచి తిరిగి వెళ్తున్న ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ జరిగింది.. ఈ ఘర్షణలో 15 ఏళ్ల నవాజ్ అహ్మద్ అనే యువకుడు మృతి చెందాడు… స్థానికుల ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు.. ఇక, యువకుడి మృతికి కారణమై.. పరారీలో ఉన్న యువకుడిని అదుపులోకి తీసుకున్నారు మొఘల్ పుర పోలీసులు.. ఘర్షణలో చనిపోయిన యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుండగా.. గొడవకు గల పూర్తి కారణాలు మాత్రం తెలియాల్సి ఉంది.
Read Also: Fuel Sales: భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ వినియోగం.. గ్యాస్‌ది అదే దారి..
