Etala Rajender: నాకు ఒక్కరక్తపు బొట్టు కారినా సీఎందే బాధ్యత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం కేసీఆర్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఫైర్ అయ్యారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో విచ్చలవిడిగా గన్ లైసెన్సులు ఇస్తున్నారని, తనకు గాని తన కుటుంబ సభ్యులకు గానీ ఒక్క రక్తపు బొట్టు కారినా దానికి భాధ్యత సీఎం కేసీఆర్‌దే అని ఈటల రాజేందర్ హెచ్చరించారు. అంతేకాకుండా.. సీఎం కేసీఆర్‌కు దమ్ము, ధైర్యం ఉంటే అసెంబ్లీని రద్దు చేసి ప్రజాభిప్రాయానికి రావాలని సవాల్ చేశారు. సీఎంను ఓడగొట్టే వరకు విశ్రమించేది లేదని అన్నారు. సీఎం కేసీఆర్ దుర్మార్గంగా వ్యహరిస్తున్నారని, ఆయన మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నాయని విమర్శించారు.
ఈనేపథ్యంలోనూ.. అసెంబ్లీలో వాస్తవాలు మాట్లాడితే సమాధానం చెప్పాల్సి వస్తుందనే భయంతోనే అకారణంగా తనను సభ నుంచి బయటికి పంపిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక.. అసెంబ్లీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బలవంతంగా పోలీసు వాహనంలో ఎక్కించి తనను ఇంటికి తీసుకెళ్లి హౌజ్ అరెస్టు చేశారని, ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని ధ్వజమెత్తారు.. మరమనిషి అంటే సొంత అలోచన లేకుండా ఇతరులు చెప్పినట్టు చేసే వారని చెప్పారు. దీంతో.. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినప్పుడు కనీసం లేఖ కూడా తీసుకోకుండా అసెంబ్లీ స్పీకర్ అవమానపరిచారన్నారు. నేను మరమనిషి అన్నందుకే ఇంత బాధపడుతున్నారు.. గతంలో ప్రధాని మోదీని ఫాసిస్ట్, దద్దమ్మ, చవట అంటూ కేసీఆర్ అనుచితంగా మాట్లాడారని, దీనికి ఆయన క్షమాపణ చెప్పాలని.. తన సస్పెన్షన్‌పై న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నట్టు ఈటల చెప్పారు.
AP Assembly Live: ఏపీ అసెంబ్లీ సమావేశాలు
Also Read
- Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్‌లో ఏముంది?
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
- Off The Record : ముహూర్తం ఖరారు కాలేదా? కేబినెట్ విస్తరణపై మళ్ళీ బ్రేక్ పడిందా?
- K Kavitha : కవితకు సమన్లు.. రేపు కోర్టుకు హాజరు కావాలని ఆదేశం..
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్‌రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!