Site icon NTV Telugu

Steel Flyover: హైదరాబాద్‌లో మరో కొత్త ఫ్లైఓవర్.. ఇందిరాపార్క్-వీఎస్‌టీ స్టీల్ నిర్మాణం..

Steel Flyover

Steel Flyover

Steel Flyover: హైదరాబాద్‌లో పలు కొత్త ఫ్లైఓవర్లు ఇటీవల ప్రారంభం కాగా, త్వరలో మరో కొత్త ఫ్లైఓవర్ కూడా అందుబాటులోకి రానుంది. ఇందిరాపార్కు నుంచి వీఎస్టీ వరకు నిర్మిస్తున్న స్టీల్‌ ఫ్లై ఓవర్‌ను ఆగస్టు 15న ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈ 2.25 కి.మీ ఫ్లై ఓవర్‌ను నాలుగు లైన్లతో నిర్మించారు. దీని నిర్మాణానికి 13 వేల టన్నుల ఉక్కును ఉపయోగించారు. ఈ స్టీల్‌ ఫ్లైఓవర్‌ నిర్మాణానికి దాదాపు రూ.350 కోట్లు ఖర్చయినట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు చెబుతున్నారు. నగరం నడిబొడ్డున ఈ ఫ్లైఓవర్‌ నిర్మాణంతో వీఎస్‌టీ జంక్షన్‌, ఆర్టీసీ క్రాస్‌ రోడ్లు, ఇందిరాపార్క్‌ క్రాస్‌ రోడ్లలో ట్రాఫిక్‌ సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. నివాస ప్రాంతాలతో పాటు వాణిజ్య సంస్థలు, కోచింగ్ సెంటర్లు, హాస్టళ్లు, కళాశాలలు, పాఠశాలలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. దీంతో ట్రాఫిక్ జామ్ విపరీతంగా ఉండడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఈ ప్రాంతాల్లో ఫ్లై ఓవర్ నిర్మించాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. ఇందుకోసం భూ యజమానులు కూడా తమ భూములను అప్పగించేందుకు ముందుకు వచ్చారు. ఫ్లైఓవర్ నిర్మాణం నగరం మధ్యలో ఉన్నందున భూసేకరణ వ్యయం రెండింతలు పెరిగిందని అధికారులు తెలిపారు.

Read also: TS Congress: కాంగ్రెస్‌ పార్టీ కీలక నిర్ణయం.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కో ఛైర్మన్‌గా బాధ్యతలు

రద్దీ ఎక్కువగా ఉండే ఈ ప్రాంతాల్లో స్టీల్‌ ఫ్లైఓవర్‌ నిర్మాణంతో ట్రాఫిక్‌ సమస్యలు తీరనున్నాయి. దీంతో లింగంపల్లి జంక్షన్, అశోక్ నగర్ క్రాస్ రోడ్డులో కూడా ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని చెబుతున్నారు. మెట్రో రైలు మార్గానికి సంబంధించిన పనులు మినహా ఫ్లైఓవర్ పనులన్నీ దాదాపు పూర్తయ్యాయి. పెండింగ్‌లో ఉన్న పనులను కూడా త్వరలో పూర్తి చేస్తామన్నారు. ఈ ఫ్లై ఓవర్‌ పనులు గతేడాది డిసెంబర్‌ నాటికి పూర్తి కావాల్సి ఉంది. కానీ రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా వర్షాల కారణంగా పనులు నిలిచిపోవడం, స్టీల్ సరఫరా నిలిచిపోవడంతో నిర్మాణ పనులు ఆలస్యమయ్యాయి. స్టీల్ ఫ్లై ఓవర్‌పై ఎల్‌ఈడీ లైట్లు, క్రాస్ బారియర్లు ఏర్పాటు చేయనున్నారు. అయితే వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రణాళికలో భాగంగా నగరంలో ఫ్లై ఓవర్ల నిర్మాణాన్ని జీహెచ్‌ఎంసీ చేపట్టనుంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఫ్లై ఓవర్లు నిర్మించారు. అలాగే ఉప్పల్‌లో ఇటీవల నిర్మించిన స్కైవాక్‌ను పాదచారులకు అందుబాటులోకి తెచ్చారు. మెహిదీపట్నంలో మరో స్కైవాక్‌ను నిర్మిస్తున్నారు. దీన్ని కూడా త్వరలో ప్రారంభించే అవకాశం ఉంది.
Telangana: నేటి నుంచే బీసీ వృత్తిదారులకు లక్ష సాయం..!

Exit mobile version