Station Ghanpur Constitution People Strange Demand To Kadiya Srihari: ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి ఓ అనూహ్యమైన ఘటన ఏర్పడింది. ఇటీవల జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని జాఫర్గడ్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో మరణించిన గుండెకుమార్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించేందుకు వెళ్లగా.. గ్రామ ప్రజలు ఆయన ముందు ఓ వినూత్నమైన అభ్యర్థన పెట్టారు. ‘మీరు నిలబడతా అంటేనే గ్రామానికి రండి, అలా కాకుండా వేరేవాళ్లకి ఓట్లు వేయమని అడిగితే ఈ రోడ్డు తొక్కకండి’ అంటూ షరతు పెట్టారు.
తమ గ్రామంలో అభివృద్ధి పనులు చేసింది మీరు మాత్రమేనని, ఆ తర్వాత ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని ఆ గ్రామ ప్రజలు కడియం శ్రీహరి ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ‘మీరు ఇక్కడ ఉంటా అంటేనే రావాలి’ అని గ్రామస్తులు దండం పెట్టి వేడుకుంటున్నారు. వేరే వాళ్లకి మాత్రం తాము ఓటు వేయమని తేల్చి చెప్తున్నారు. ఈ విధంగా కడియం శ్రీహరిని వేడుకుంటున్న వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. కాగా.. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను గెలిపించాలని, కేసీఆర్ ఆదేశాల మేరకు అన్ని గ్రామాల్లోనూ తనని చూసి రాజయ్యకు ఓటేయాలని కడియం శ్రీహరి ప్రచారం చేసిన సంగతి విదితమే!