Malla Reddy: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి స్టార్ షూటర్ ఇషా సింగ్ చేరుకున్నారు. మంత్రి మల్లారెడ్డి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లి స్వయంగా ఇషా సింగ్ ను సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ఇషా సింగ్ మాట్లాడుతూ.. మెడల్స్ సాధించడం చాలా హ్యాపీగా ఉందన్నారు. నెక్స్ట్ ఏషియన్ ఛాంపియన్ షిప్ ఉంది… ప్రిపేర్ అవుతున్నానని అన్నారు. నన్ను సపోర్ట్ చేసిన గవర్నమెంట్ కి, సీఎం కెసిఆర్ కి థ్యాంక్స్ అని తెలిపారు. అనంతరం మల్లారెడ్డి ఇషా సింగ్ మన తెలంగాణ బిడ్డ అయినందుకు గర్వంగా ఉందన్నారు. ఇషా సింగ్ నా యూనివర్సిటీ అమ్మాయి… ఇషాకి పది లక్షల చెక్ అందిస్తున్నామని తెలిపారు. తెలంగాణలో క్రీడలను ఎంకరేజ్ చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో లక్షలాది ఇషా సింగ్ లు తయారవుతున్నారని అన్నారు. ప్రతి ఊరిలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఇషాను వెల్కమ్ చెప్పడానికి వచ్చిన మల్లారెడ్డి యూనివర్సిటీ విద్యార్థులతో జై కెసిఆర్, జై మల్లారెడ్డి, జై కెటిఆర్ అనిపించి హంగామా చేసారు. దీంతో శంషాబాద్ ప్రాంతమంతా మల్లారెడ్డి మాటలతో ఆహ్లాద వాతావరణం చోటుచేసుకుంది.
చైనాలోని హాంగ్‌జౌలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో యువ షూటర్ ఇషా సింగ్ అద్భుత ప్రదర్శన చేసింది. ఆసియా క్రీడల షూటింగ్ చరిత్రలో నాలుగు పతకాలు సాధించిన తొలి భారత మహిళా షూటర్‌గా రికార్డు సృష్టించింది. ఈ ఉదయం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో హైదరాబాద్‌కు చెందిన ఇషా సింగ్‌తో పాటు పాలక్, దివ్యలతో కూడిన భారత జట్టు రజతం సాధించింది. ఫైనల్లో ఈ త్రయం 1731 స్కోరుతో రెండో స్థానం దక్కించుకోగా.. 1736 స్కోరుతో చైనా స్వర్ణం కైవసం చేసుకోగా.. చైనీస్ తైజీ జట్టు కాంస్యం సాధించింది. కాగా, మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో ఇషా సింగ్ రెండో స్థానంతో రజతం సాధించగా, పాలక్ స్వర్ణం కైవసం చేసుకుంది. మరోవైపు పురుషుల రైఫిల్ 3 పొజిషన్స్ విభాగంలో భారత జట్టు స్వర్ణం సాధించింది. ఫైనల్లో ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్, స్వప్నిల్ సురేష్, అఖిల్ షెరాన్‌లతో కూడిన పురుషుల జట్టు 1769 స్కోరుతో స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. పురుషుల డబుల్స్ టెన్నిస్‌లో తెలుగు ప్లేయర్ సాకేత్ మైనేని, రామ్ కుమార్ రామనాథన్ రజత పతకాన్ని గెలుచుకున్నారు. మొత్తంగా భారత్‌కు రెండు స్వర్ణాలు, మూడు రజతాలు లభించాయి.