NTV Telugu Site icon

Munawar Faruqui: నిన్న మునావర్ బెంగళూరు షో రద్దు.. నేడు హైదరాబాద్ షోపై ఉత్కంఠ..

Munawar Faruqui

Munawar Faruqui

permission to munawar faruqui comedy show in hyderabad: ప్రముఖ స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ రేపు హైదరాబాద్లో నిర్వహించనున్న షో వివాదాస్పదం అవుతోంది. ఈ షోకి పోలీసులు అనుమతి ఇవ్వడంపై రాష్ట్ర బీజేపీ నేతలు మండిపడుతుండగా.. బెంగళూరులో నిన్న జరగాల్సిన మునావర్ షో చివరి నిమిషంలో రద్దైంది. ఎలాంటి అనుమతి తీసుకోకపోవడంతో రద్దు చేసినట్లు బెంగళూరు పోలీసులు వెల్లడించగా.. వివాదంగా మారుతున్న నేపథ్యంలో నేటి హైదరాబాద్ షోపై ఉత్కంఠ నెలకొంది.

ఇవాళ హైటెక్స్‌లో మునావర్‌ ఫారుఖీ కామెడీ షో నిర్వహించేందుకు అభిమానులు సన్నాహాలు మొదలయ్యాయి. కొద్దిరోజులుగా మునావర్‌ షారూఖీ షో హైదరాబాద్‌ లో నిర్వహించకూడదని, ఒకవేళ షోను అనుమతిస్తే అడ్డుకుంటామని, వేదికను తగలబెడతామని బీజేపీ శ్రేణులు వార్నింగ్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. అయినా కూడా మునావర్‌ షోను హైదరాబాద్‌ లో నిర్వహించేందుకు తెలంగాణ సర్కార్ పరిమిషన్‌ లభించడంతో టెన్షన్ మొదలైంది. రాజాంగ్ మునావర్ షోను అడ్డుకుంటామని, వేదికను తగలపెడతామని ప్రకటించడంతో.. పోలీసులు రాజాసింగ్ ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నేడు మునావర్ ఫరూఖీ హైదరాబాద్ షో నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా రాజాసింగ్ బయటకు వెళ్లకుండా ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

మునవార్ ఫారుఖీ నేడు హైదరాబాద్‌కి రాబోతున్నాడు. ఇవాళ ‘డోంగ్రీ టు నోవేర్’ పేరుతో ఓ లైవ్ షో ఏర్పాటు చేస్తున్నట్లు ఈ విషయాన్ని ఫారుఖీ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించిన విషయం తెలిసిందే.. దీంతో సర్వత్రా ఉత్కంఠంగా మారింది. హిందువు దేవుళ్లను కించపరిచే విధంగా షో లో వాఖ్యలు ఉంటాయని పిర్యాదు చేశారు. గతంలో ఓ కార్యక్రమంలో భాగంగా సీతాదేవిపై ఫారుఖీ జోకులు వేసినందుకు వివాదాస్పదమైంది. కర్ణాటకలో అతడ్ని బ్యాన్ చేశారు. అందుకే, హైదరాబాద్‌లోనూ అతడి షోలు నిర్వహించకూడదని రాజాసింగ్ కోరుతున్నారు. అయితే ఇన్ని వివాదాస్పదలు ఎదురవుతున్నా ఫారూఖీ షోను అనుమతించడంతో సర్వత్రా ఉత్కంఠ చోటుచేసుకుంది. షారూఖీ షోలో ఎటువంటి అవాంత సంఘటనలు జరగకుండా చూసుకునేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.
Kanishka Soni: శృంగారానికి మగాడు అక్కర్లేదట.. తనను తానే పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి..!!

Show comments