Site icon NTV Telugu

Srushti Testtube Baby Centre: ఎఫ్ఐఆర్‌లో సంచలన వివరాలు

Srushti Test Tube Baby Cent

Srushti Test Tube Baby Cent

Srushti Testtube Baby Centre: హైదరాబాద్‌లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ పై నమోదైన కేసు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. గోపాలపురం పోలీసులు ఈనెల 25న ఈ కేసును నమోదు చేసినట్లు అధికారికంగా ధృవీకరించారు. రాజస్థాన్‌కు చెందిన బాధితురాలు సోనియా ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

బాధితురాలు సోనియా తన ఫిర్యాదులో, గత సంవత్సరం ఆగస్టు నెలలో డాక్టర్ నమ్రతను సంప్రదించామని పేర్కొంది. సంతానం కోసం IVF (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) ప్రొసీజర్ చేయించాలని నిర్ణయించుకున్నామని తెలిపింది. అయితే, ప్రొసీజర్ కోసం డాక్టర్ నమ్రత ₹30 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొంది.

MLA Sanjay : ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సెల్ఫీ వీడియో.. రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్

ఈ మొత్తంలో ₹15 లక్షలు చెక్కు రూపంలో, మిగతా ₹15 లక్షలు బ్యాంక్ అకౌంట్‌ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేసినట్లు బాధిత దంపతులు తెలిపారు. అంతేకాక, కేవలం మెడికల్ టెస్టులకే ₹66,000 అదనంగా తీసుకున్నారని సోనియా ఆరోపించింది.

ప్రొసీజర్‌లో భాగంగా సోనియా దంపతులను విశాఖపట్నంలోని మరో బ్రాంచ్‌కి పంపించారని, అక్కడ శాంపిల్ కలెక్షన్ జరిగింది అని ఫిర్యాదులో వివరించారు. అయితే, ఈ ప్రక్రియలో అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు.

ఈ కేసును గోపాలపురం పోలీసులు BNS 61, 316, 318, 335, 336, 340 సెక్షన్ల కింద నమోదు చేశారు. ఇవి మోసం, దొంగతనం, బలవంతం, ఇతర క్రిమినల్ నేరాలకు సంబంధించిన సెక్షన్లు కావడం గమనార్హం.

Hamas: టర్కీకి పారిపోయి మళ్లీ వివాహం చేసుకున్న “హమాస్” చీఫ్ భార్య..

Exit mobile version