DCP Rashmi Perumal : సరోగసి పేరు చెప్పి.. చైల్డ్ ట్రాఫికింగ్ చేశారు
- సృష్టి క్లినిక్ కేసులో సంచలన విషయాలు వెల్లడించిన పోలీసులు
- వేరే మహిళకు పుట్టిన బిడ్డను తీసుకొచ్చి సరోగసి ద్వారా పుట్టిందని నమ్మించారు
- ఢిల్లీకి చెందిన గర్భిణిని ఫ్లైట్‌లో విశాఖకు తీసుకొచ్చి డెలివరీ చేశారు
- ఆ బిడ్డనే దంపతులకు ఇచ్చారు
- బిడ్డను ఇచ్చినందుకు ఢిల్లీకి చెందిన మహిళకు రూ.90వేలు ఇచ్చారు
- సరోగసి కోసం దంపతుల దగ్గర మొత్తం రూ.40 లక్షలు వసూలు చేసిన డా.నమ్రత :డీసీపీ రష్మి పెరుమాళ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DCP Rashmi Perumal : సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ క్లినిక్‌పై దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సరోగసి పేరుతో అక్రమ చైల్డ్ ట్రాఫికింగ్ జరిగిందని పోలీసులు స్పష్టంచేశారు. నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాళ్ వెల్లడించిన వివరాలు సంచలనంగా మారాయి.
సృష్టి క్లినిక్‌లో సరోగసి పద్ధతిలో బిడ్డను కల్పిస్తామని చెబుతూ, వాస్తవానికి వేరే మహిళకు పుట్టిన బిడ్డను ఇవ్వడం ద్వారా దంపతులను మోసం చేశారని పోలీసులు తెలిపారు. ఢిల్లీకి చెందిన ఒక గర్భిణి మహిళను ఫ్లైట్‌లో విశాఖపట్నానికి తీసుకొచ్చి, అక్కడ డెలివరీ చేయించారని రష్మి పెరుమాళ్ తెలిపారు. పుట్టిన బిడ్డను ఆంధ్రప్రదేశ్‌లోని ఒక దంపతులకు సరోగసి బిడ్డ అని నమ్మించారు.
Also Read
సరోగసి పేరుతో డాక్టర్ నమ్రత దంపతుల వద్ద నుండి రూ.40 లక్షలు వసూలు చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. అదే సమయంలో బిడ్డను ప్రసవించిన ఢిల్లీ మహిళకు రూ.90,000 ఇచ్చినట్లు విచారణలో తేలింది. ఈ మొత్తం లావాదేవీలన్నీ సరోగసి సేవల పేరిట మోసపూరితంగా నిర్వహించినట్లు అనుమానం వ్యక్తం చేశారు.
డీసీపీ రష్మి పెరుమాళ్ మాట్లాడుతూ.. సరోగసి పేరుతో మోసం మాత్రమే కాకుండా, చైల్డ్ ట్రాఫికింగ్ జరుగుతోందన్నారు. బిడ్డను ఇతర మహిళ నుంచి తెచ్చి సరోగసి బిడ్డ అని చెప్పి దంపతులను మోసం చేశారన్నారు. నమ్రతపై ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో 10కి పైగా కేసులు నమోదయ్యాయని ఆమె వెల్లడించారు. IVF విఫలతలు, సరోగసి అక్రమాలు ఈ కేసుల్లో ప్రధానంగా ఉన్న అంశాలు అని డీసీపీ రష్మి పెరుమాళ్ పేర్కొన్నారు.
నమ్రతపై బాధితులు ఫిర్యాదులు చేయకుండా అడ్డుకునే ప్రయత్నాలు కూడా బయటపడ్డాయి. తన కొడుకు జయంత్ అడ్వకేట్ కావడం వలన, కోర్టు కేసుల పేరుతో బాధితులను బెదిరించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభవార్తలే, పండగే ఇవాళ!
-
Eng vs NZ: లార్డ్స్ టెస్టులో బౌలర్ల హవా.. తొలి రోజే 16 వికెట్లు డౌన్.. అసలేమవుతోంది.?
-
Vladimir Putin: “మోడీపై ఒత్తిడి తేవడం ఎవరి తరం కాదు”.. భారత్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్ గట్టి మద్దతు
-
Suryakumar Yadav: ఏడాదిలోనే హీరో నుంచి జీరోగా? సూర్యకుమార్ హిస్టరీలో బిగ్ ఫెయిల్యూర్స్ ఇవే..
-
Donald Trump: మోడీ నాకు మంచి స్నేహితుడు.. భారత్‌తో త్వరలో వాణిజ్య ఒప్పందం..
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!