Srisailam Dam: శ్రీశైలం వైపు దూసుకొస్తున్న కృష్ణమ్మ.. వారంలో గేట్లు ఎత్తే అవకాశం.!
- కృష్ణా పరివాహకంలో భారీ వర్షాలు
- ఆల్మట్టికి 2 లక్షల క్యూసెక్కుల వరద అంచనా
- శ్రీశైలం వైపు వేగంగా కృష్ణమ్మ ప్రవాహం
- వారం రోజుల్లో గేట్లు ఎత్తే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srisailam Dam: కృష్ణా పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ ఉప్పొంగి శ్రీశైలం వైపు వేగంగా దూసుకొస్తోంది. మహారాష్ట్రలోని మహాబలేశ్వర్‌లో ఏకంగా 220 మి.మీ. వర్షపాతం నమోదు కావడంతో కృష్ణా, కోయనా నదులు ప్రళయరూపంలో ప్రవహిస్తున్నాయి. అక్కడ రాధానగరి, వారణా జలాశయాలు ఇప్పటికే పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోవడంతో, రాబోయే 48 గంటల్లో ఆల్మట్టి డ్యామ్‌కు ఏకంగా 2 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువన వర్షాలు ఇలాగే కొనసాగితే ఈ ప్రవాహం మరింత తీవ్రతరం కానుంది.
Also Read
ప్రస్తుతం కర్ణాటకలోని నారాయణపూర్ డ్యామ్ నుంచి 1.20 లక్షల క్యూసెక్కులు, భీమా నది నుంచి 60 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో తెలంగాణ, ఏపీ సరిహద్దుల్లోని శ్రీశైలం జలాశయానికి జలకళ సంతరించుకుంది. రాబోయే వారం రోజుల పాటు శ్రీశైలానికి భారీ స్థాయిలో వరద కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదే ఉధృతి మరొక వారం రోజులు ముమ్మరంగా కొనసాగితే శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండిపోయి, అధికారులు గేట్లు ఎత్తి నాగార్జునసాగర్ వైపు కృష్ణమ్మను పరుగులు తీయించనున్నారు.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!